Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: రాజమౌళి-మహేష్‌ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..

Rajamouli: రాజమౌళి (Rajamouli) పేరు ఇప్పుడు నేషనల్‌ వైడ్‌గా మారుమోగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా ప్రమోషన్స్‌తో మొత్తం దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ramcharan)లతో కలిసి మొత్తం దేశాన్ని చుట్టేస్తున్నారు జక్కన్న. ఈ క్రమంలోనే...

Rajamouli: రాజమౌళి-మహేష్‌ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..
Narender Vaitla
|

Updated on: Mar 20, 2022 | 2:32 PM

Share

Rajamouli: రాజమౌళి (Rajamouli) పేరు ఇప్పుడు నేషనల్‌ వైడ్‌గా మారుమోగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా ప్రమోషన్స్‌తో మొత్తం దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ramcharan)లతో కలిసి మొత్తం దేశాన్ని చుట్టేస్తున్నారు జక్కన్న. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రచారం చేస్తూ సరికొత్త ఒరివడికి శ్రీకారం చుట్టారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాటు, తన తర్వాతి ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకుంటున్నారు జక్కన్న.

ఈ క్రమంలోనే తన తర్వాతి చిత్రంపై ఓ స్పష్టతను ఇచ్చారు జక్కన్న. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత రాజమౌళి మహేష్‌ చిత్రాన్ని మొదలు పెట్టనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆఫ్రికన్‌ అడవుల్లో జరిగే థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ హింట్‌ ఇచ్చారు. ఇక ఈ సినిమా సెట్స్‌పైకి కూడా వెళ్లక ముందే మహేష్-రాజమౌళి చిత్రంపై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరో సీనియర్‌ హీరో నటించనున్నారని వార్తలు వచ్చాయి. మొదట విక్రమ్‌ అని తర్వాత బాలకృష్ణ అనే చర్చ జరిగింది.

అయితే విక్రమ్‌ నటించట్లేదని తర్వాత క్లారిటీ వచ్చేసింది. కానీ బాలకృష్ణ దాదాపు ఖరారు అన్నట్లు చర్చ జరిగింది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న జక్కన్న..ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో మరో హీరో ఎవరు నటించడం లేదని, మహేష్‌ బాబు ఒక్కరే నటించనున్నారని స్పష్టం చేశారు రాజమౌళి. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత కొన్ని రోజులపాటు హాలీడే ఎంజాయ్‌ చేయనున్న రాజమౌళి.. చిన్న గ్యాప్‌ తర్వాత మహేష్‌ బాబు సినిమాను మొదలు పెట్టనున్నారు.

Also Read: Cyclone Asani Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీకి మరో రెండు రోజుల పాటు వర్ష సూచన..

Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..

Petrol Diesel Price: దేశంలో స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే..