Cyclone Asani Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీకి మరో రెండు రోజుల పాటు వర్ష సూచన..
Cyclone Asani Alert:
బంగాళాఖాతంలో అల్పపీడనం(Cyclone alert) ఏర్పడిందని భారత వాతావరణ శాఖ(IMD Alert) ప్రకటించింది. ఇది వాయుగుండంగా మారనుందని, అనంతరం సోమవారం తుఫానుగా మారే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయని తెలిపారు. అనంతరం మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చి, 2022 న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయని వివరించారు.
రాగల 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో శనివారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Andaman and Nicobar Islands administration cancels scheduled sailing of vessels in Foreshore Sector (services between Port Blair and nearby Islands) and issues helpline number 03192-245555/232714 & toll-free number – 1-800-345-2714 for passengers, in view of #CycloneAsani pic.twitter.com/lBXatkpNYI
— ANI (@ANI) March 20, 2022
ఇవి కూడా చదవండి: Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..
BP Control Tips: బీపీ అస్సలు రాకుండా ఉండాలంటే.. ముందు ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..