APSRTC: టికెట్ కొనేందుకు డబ్బులు లేవా.. అయినా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగంటే
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవాలంటే నగదు తప్పనిసరి. మన దగ్గర యూపీఐ పేమెంట్స్(UPI Payments) చేసే వెసులుబాటు ఉండి, నగదు లేకపోతే ప్రయాణించేందుకు కుదరదు. అంతే కాకుండా బస్సుల్లో నిత్యం..
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవాలంటే నగదు తప్పనిసరి. మన దగ్గర యూపీఐ పేమెంట్స్(UPI Payments) చేసే వెసులుబాటు ఉండి, నగదు లేకపోతే ప్రయాణించేందుకు కుదరదు. అంతే కాకుండా బస్సుల్లో నిత్యం చిల్లర సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు ఇవి గొడవలకూ దారితీస్తాయి. ఈ ఇబ్బందులన్నింటినీ తగ్గించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల నుంచి అవసరమైన మొత్తాన్ని ప్రస్తుతం నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులు జరిగే విధంగా ‘యూనిఫైడ్ టికెటింగ్ సిస్టం (UTS)’ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన టెండర్‌ను అభి బస్ సంస్థ దక్కించుకుంది. యూటీఎస్ కోసం ఆర్టీసీ నిర్వహించిన టెండర్లలో 8 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. మూడు కంపెనీలు అర్హత సాధించగా.. రివర్స్ టెండరింగ్‌లో అభి బస్ సంస్థను ఆర్టీసీ ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్) ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో ఈ–పాస్ మెషిన్లను ప్రవేశపెడతారు. వాటిద్వారా డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తారు.
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో ముందుగా టికెట్ల బుకింగ్‌లు, బస్‌పాస్‌లు, కొరియర్ సేవలు, పార్సిల్ బుకింగ్‌లకూ అవకాశం కల్పిస్తారు. బస్ లైవ్ ట్రాకింగ్, ప్రయాణికుల సమాచారం, సెంట్రల్ కమాండ్ స్టేషన్ నిర్వహణ మొదలైనవి అందుబాటులోకి వస్తాయి. దీనిని ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేయనున్నారు. మరోవైపు.. కృష్ణా జిల్లా (Krishna district) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్లేవారికి, అటు నుంచి ఇటు వచ్చే వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు నడిచే అన్ని రకాల ఏసీ బస్సుల్లో 20 శాతం చార్జీలను (discount) తగ్గించాలని నిర్ణయించారు. ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో చార్జీలను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
Also Read
RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ఫంక్షన్‌లో జనసేన జెండాల సందడి.. నెట్టింట వీడియో వైరల్
Rajamouli: రాజమౌళి-మహేష్ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..
Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..