Petrol Diesel Price: దేశంలో స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే..

దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు (ఆదివారం, మార్చి 20) ఇంధన ధరలో ఎలాంటి మార్పు లేదు. చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తాయి...

Petrol Diesel Price: దేశంలో స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే..
Petrol Diesel Price
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 20, 2022 | 10:05 AM

దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు (ఆదివారం, మార్చి 20) ఇంధన ధరలో ఎలాంటి మార్పు లేదు. చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరను బట్టి పెట్రోల్-డీజిల్ ధర నిర్ణయించబడుతుంది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.18 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.88గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.36గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.99 ఉండగా.. డీజిల్ ధర రూ.94.82గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.91కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.38లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.40 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.51గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.28గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.38గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.91లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.96లకు లభిస్తోంది.

Read Also..  Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. మీ ఖర్చు తగ్గుతుంది..