Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airlines: అప్పుల ఊబిలోకి విమానయాన కంపెనీలు.. పరిస్థితి ఇలానే ఉంటే..

భారత్‌లో రెండేళ్లుగా ఏవియేషన్ కంపెనీలు అంటే విమానయాన కంపెనీల ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతోంది. ఈ పరిశ్రమ కష్టాలు ఇంకా తీరేలా కనిపించడం లేదు...

Airlines: అప్పుల ఊబిలోకి విమానయాన కంపెనీలు.. పరిస్థితి ఇలానే ఉంటే..
Aviation Business
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 20, 2022 | 10:10 AM

భారత్‌లో రెండేళ్లుగా ఏవియేషన్ కంపెనీలు అంటే విమానయాన కంపెనీల ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతోంది. ఈ పరిశ్రమ కష్టాలు ఇంకా తీరేలా కనిపించడం లేదు. దేశంలోని అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలు మార్చి 27 నుంచి పూర్తి సామర్థ్యంతో ప్రయాణించవలసి ఉంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో కోవిడ్ వ్యాప్తి చైనాలో వేగంగా వ్యాపించడం ప్రారంభమైంది. నిజానికి, ఏవియేషన్ కంపెనీల వ్యాపార నమూనా మొత్తం లాక్‌డౌన్‌లో గాలిలో వెలుగుతున్న దీపంగా మారిపోయింది. విమానాలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఏవియేషన్ పరిశ్రమ మనుగడ గందరగోళంలో పడిపోయింది.

దీంతో కంపెనీలు భారీ అప్పుల్లో కూరుకుపోయి లాభాల నుంచి నష్టాల్లోకి జారిపోయాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత, ఈ రంగం మునుపటిలా కొలుకుంటుందని భావించారు. కానీ.. టేకాఫ్ తర్వాత, నగదు కొరత ఖరీదైన ఇంధనం వంటి సమస్యలు ఈ ఇండస్ట్రీ నష్టాల పాలు చేస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ వరకు ఇండిగో నష్టం రూ.4,600 కోట్లు దాటింది… స్పైస్‌జెట్ నష్టం కూడా వేగంగా పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ ముగింపుతో, ప్రయాణీకుల మెరుగుదల వచ్చింది. డిసెంబర్‌లో 10 మిలియన్లకు పైగా దేశీయ ప్రయాణీకులు విమానంలో ప్రయాణించారు. కాని జనవరిలో థర్డ్ వేవ్ మళ్లీ విమానాలు ప్రయాణీకుల బరువు లేకుండానే ఎగరాల్సి వచ్చింది.

ఫిబ్రవరిలో పరిస్థితులు మళ్లీ మెరుగుపడ్డాయి. ఈసారి రష్యా ..ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఒక్కసారిగా విమాన ఇంధన ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షం లెవల్‌కి పెరిగిపోయాయి. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 87 శాతానికి పైగా ధరలు పెరగగా, విమానయాన సంస్థల మొత్తం వ్యయంలో 40-45 శాతం కేవలం ఇంధనానికే ఖర్చు అవుతుంది. విమానయాన సంస్థలు ఇప్పటికే భారీ అప్పుల భారం మోస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు ఇండిగో రూ.2,500 కోట్లు, స్పైస్‌జెట్ రూ. 707 కోట్లు అప్పుల్లో ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అప్పులు ..నష్టాలతో ఉన్న ఎయిర్‌లైన్స్ కంపెనీలను బెయిల్ చేయడానికి, 5 బిలియన్ డాలర్లు అంటే సుమారు 35-40 వేల కోట్ల రూపాయలు అవసరం. ఇందుకోసం కంపెనీలు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నాయి… కానీ వనరుల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుంది? ఖర్చుల కోసం ప్రభుత్వమే అప్పులు చేస్తోంది.

Read Also.. Russia-Ukraine War: ప్లాటినం, పల్లాడియం, రోడియం లోహాలకు కొరత.. ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావం..