AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: ప్లాటినం, పల్లాడియం, రోడియం లోహాలకు కొరత.. ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావం..

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆటోమొబైల్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వాహనాలక తయారీకి ఉపయోగించే లోహాలు రష్యాలో అధికం ఉన్నాయి...

Russia-Ukraine War: ప్లాటినం, పల్లాడియం, రోడియం లోహాలకు కొరత.. ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావం..
Auto Sector
Srinivas Chekkilla
|

Updated on: Mar 20, 2022 | 8:03 AM

Share

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆటోమొబైల్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వాహనాలక తయారీకి ఉపయోగించే లోహాలు రష్యాలో అధికం ఉన్నాయి. ఈ లోహాలను రష్యా నుంచి అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో, రష్యా వాటిని సరఫరా చేయలేకపోతున్నందున ఈ లోహాలను వినియోగించే వ్యాపార రంగాలకు ఇబ్బందికరంగా మారనుంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మనదేశంలో వాహన రంగానికి ఇబ్బందులు తప్పవని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఖరీదైన కార్ల నుంచి సాధారణ మోటార్‌సైకిల్‌/ స్కూటర్‌ వరకూ.. అన్ని వాహనాల్లో ఈ లోహాలను వినియోగిస్తుండటమే ఇందుకు కారణం. బీఎస్‌-6 కాలుష్య ప్రమాణాల ప్రకారం ఇంజిన్లను రూపొందించడానికి, ఈ లోహాలను వాహన కంపెనీలు వినియోగిస్తున్నాయి. ప్రధానంగా రష్యా, దక్షిణాఫ్రికా దేశాల నుంచే మన వాహన కంపెనీలు రోడియం, పల్లాడియమ్‌… తదితర లోహాలను దిగుమతి చేసుకుంటాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఈ లోహాల ధరలు పెరగడంతో పాటు సరఫరాలు కూడా సమస్యాత్మకంగా మారుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు బ్యారెల్‌ ధర 100 డాలర్ల వద్ద ఉంది. ఇటీవల బ్యారెల్‌ 139 డాలర్లకు చేరినా, మళ్లీ తగ్గింది. యుద్ధం ముగిస్తే ముడిచమురు ధర ఇంకా దిగి వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని అమెరికా ఖరారు చేస్తే, ఇరాన్‌ నుంచి కూడా చమురు ఎగుమతులు మొదలవుతాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం ముడిచమురు ధర అధికమై, పెట్రోలు- డీజిల్‌ రిటైల్‌ ధరలను దేశీయంగా పెంచాల్సి వస్తుంది. ఇప్పటికే పెట్రోల్‌ లీటర్‌ రూ.100పైన ఉండగా, ఇంకా పెరిగితే వాహన అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇప్పటికే సెమీకండక్టర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న ఆటోమొబైల్ కంపెనీలకు ఈ యుద్ధంతో మరింత కొరతను ఎదుర్కొంటున్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో వాడే చిప్‌సెట్ల తయారీలోనూ ప్లాటినం, పల్లాడియం వినియోగిస్తుంటారు. వీటి ధరలు బాగా పెరిగినా, లభ్యత కొరవడినా కార్లకు ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల కొరత అధికమవుతుంది. అందువల్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, సరికొత్త మోడళ్ల ఆవిష్కరణా ఆలస్యమవుతుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్‌ వంటి కంపెనీలు ఉక్రెయిన్‌ నుంచే విడిభాగాలను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇవి నిలిచిపోగా, రష్యా- ఉక్రెయిన్‌ దేశాలకు కార్లు ఎగుమతి చేయలేని పరిస్థితీ నెలకొంది.

Read Also.. South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..104 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..