RRR: మూవీ లవర్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. ఆ ఫార్మాట్‌లో కూడా విడుదల..

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతోందా అని యావత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా దేశం దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం, ఎన్టీఆర్‌ (NTR).. రామ్‌ చరణ్‌ (RamCharan) కలిసి నటిస్తుండడంతో..

RRR: మూవీ లవర్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. ఆ ఫార్మాట్‌లో కూడా విడుదల..
Rrr Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 20, 2022 | 6:46 PM

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతోందా అని యావత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా దేశం దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం, ఎన్టీఆర్‌ (NTR).. రామ్‌ చరణ్‌ (RamCharan) కలిసి నటిస్తుండడంతో ఆకాశాన్ని తాకే అంచనాలు ఈ సినిమా సొంతమయ్యాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్‌, పాటలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి. ఇందులో భాగంగానే భారీ సెట్టింగ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో విజువల్‌ ట్రీట్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

అందరి ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక విడుదలకు ముందే ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్‌ షోలతోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు మరో విజువల్‌ ట్రీట్‌ను అందించేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఏకంగా 3డీ వెర్షన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారంగా ప్రకటించింది. ఏయే థియేటర్లలో 3డీ వెర్షన్‌ విడుదల కానుందన్న విషయం త్వరలోనే ప్రకటించనున్నారు.

దీంతో అభిమానులు మరింత ఎగ్జైట్‌ అవుతున్నారు. జక్కన్న మార్క్‌ యాక్షన్‌ సన్నివేశాలను 3డీలో వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక విడుదలకు కొన్ని రోజులే సమయం ఉండడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్ ప్రమోషన్స్‌తో హోరెత్తిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచిన యూనిట్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తోంది.

Also Read: BJLP Meeting: మార్చి 24న యూపీ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం.. ఎల్పీనేతగా యోగి.. పరిశీలకులుగా అమిత్ షా!

RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ఫంక్షన్‌లో జనసేన జెండాల సందడి.. నెట్టింట వీడియో వైరల్

COVID Cases: ప్రపంచవ్యాప్తంగా ఫోర్త వేవ్ విజృంభణ.. భారత్‌లో తగ్గుతున్న కేసులు.. అయినా..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!