BJLP Meeting: మార్చి 24న యూపీ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం.. ఎల్పీనేతగా యోగి.. పరిశీలకులుగా అమిత్ షా!

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు యోగి ఆదిత్యానాథ్ రెడీ అయ్యారు.

BJLP Meeting: మార్చి 24న యూపీ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం.. ఎల్పీనేతగా యోగి.. పరిశీలకులుగా అమిత్ షా!
Yogi Amit Shah
Follow us

|

Updated on: Mar 20, 2022 | 5:10 PM

UP BJP Legislature Party Meeting: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో భారతీయ జనతా పార్టీ(BJP) రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు యోగి ఆదిత్యానాథ్(Yogi Adithyanath) రెడీ అయ్యారు. ఇందుకోసం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం మార్చి 24న జరగనుంది. ఈ సమావేశంలో, ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ తరువాత యూపీ ముఖ్యమంత్రిగా యోగి రెండోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈసారి ఈ సమావేశానికి అమిత్ షాను పరిశీలకులుగా నియమించారు. ఆయనతో పాటు జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్‌ను కూడా పరిశీలకుడిగా రానున్నారు. మార్చి 25న సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ సహా సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా హాజరుకానున్నారు.

కాగా, యూపీలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎన్నిక లాంఛనమే. యోగి ఆదిత్యనాథ్ మళ్లీ బీజేఎల్పీ నాయకుడిగా ఎన్నిక కానున్నారు. అయితే అమిత్ షా పరిశీలకుడిగా మారడంతో అదో పెద్ద ఈవెంట్‌గా మారింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మార్చి 24 మధ్యాహ్నం శాసనసభా పక్ష సమావేశం ఉంటుంది. అందుకు అవసరమైన అన్ని నిర్ణయాలను ముందుగా తీసుకోవాలని భావిస్తున్నారు.

ఈసారి యోగి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉంటారో లేదో స్పష్టం కావల్సి ఉంది. డిప్యూటీ సీఎంను చేయాలని నిర్ణయించుకుంటే ఈ సంఖ్య రెండుగా మిగిలిపోవచ్చు. లేదంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలను డిప్యూటీ సీఎంలుగా చేశారు. కేశవ్‌ ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించాలని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. శాసనసభా పక్ష సమావేశానికి ముందే దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కేబినెట్ ముఖాముఖీ నిర్ణయం అప్పటికి జరిగి ఉండేది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సులువుగా ఉండే విధంగా కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

యూపీ బీజేపీ అధ్యక్షుడి విషయంలోనూ కొత్త చర్చ మొదలైంది. స్వతంత్ర దేవ్ సింగ్ పదవీకాలం జూలైతో ముగియనుంది. ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్రాహ్మణ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బ్రాహ్మణ నేతను డిప్యూటీ సీఎం చేయడం కష్టమే అనిపిస్తోంది.

Read Also…. Pakistan Politics: ఫాస్ట్ బౌలర్ రనౌట్ అవడం ఖాయం.. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం