AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine: దయ చూపని రష్యా సేనలు.. ఆకలితో అలమటిస్తున్న ఉక్రెయిన్ పౌరులు

రష్యా - ఉక్రెయిన్ మధ్య పోరు (Russia - Ukraine War) రోజు రోజుకు తీవ్రమవుతోంది. రష్యా సేనల దాడులు, ఉక్రెయిన్ సైన్యం ప్రతిదాడులతో నిత్యం మారణహోమం జరుగుతోంది. ఉక్రెయిన్ లోని ప్రముఖ నగరం మేరియాపోల్‌లో...

Russia-Ukraine: దయ చూపని రష్యా సేనలు.. ఆకలితో అలమటిస్తున్న ఉక్రెయిన్ పౌరులు
Russia Ukraine War
Ganesh Mudavath
|

Updated on: Mar 20, 2022 | 7:16 PM

Share

రష్యా – ఉక్రెయిన్ మధ్య పోరు (Russia – Ukraine War) రోజు రోజుకు తీవ్రమవుతోంది. రష్యా సేనల దాడులు, ఉక్రెయిన్ సైన్యం ప్రతిదాడులతో నిత్యం మారణహోమం జరుగుతోంది. ఉక్రెయిన్ లోని ప్రముఖ నగరం మేరియాపోల్‌లో ప్రస్తుతం ఎటు చూసినా శవాల కుప్పలు, శిథిలాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఆప్తులను పోగొట్టుకుని తీవ్ర దుఖ సాగరంలో మునిగి పోయిన వారికి ఆహార కొరత ప్రాణసంకటంగా మారింది. ప్రాణాలతో బయటపడిన ప్రజలు ఆకలితో (Hungry) అలమటిస్తున్నారు. అయితే మేరియాపోల్ వాసులపై రష్యా దళాలు జాలి చూపడం లేదు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారికి ఆహారం (Food), నీరు అందించడానికి నిరాకరిస్తున్నారు. ఆకలిని తట్టుకోలేక ప్రజలు ఫుడ్ స్టోర్లలోకి చొరబడి ఆహారాన్ని వెతుక్కుంటున్నారు. నగరానికి ఆహారం తీసుకెళ్లే కాన్వాయ్​పై రష్యా దళాలు దాడి చేశాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మంచును కరిగించి దాహం తీర్చుకుంటున్నారు. యుద్ధం కారణంగా ప్రజలకు విద్యుత్, గ్యాస్‌, ఆహారం అందుబాటులో లేకుండా పోయాయి.

మరోవైపు.. డిమాండ్‌కు తగ్గట్టుగా యూరప్‌లో పశువుల లభ్యత కావడం లేదు. లైవ్‌స్టాక్‌కి (Life Stock) ఆహారంగా అందించే దినుసుల్లో మొక్కజొన్న గింజలు ప్రధానం, యూరప్‌ దేశాల్లోని లైవ్‌స్టాక్‌కి సరఫరా అయ్యే మొక్కజొన్నలో అత్యధిక భాగం ఉక్రెయిన్‌ నుంచే సరఫరా అవుతుంది. కానీ ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఓడరేవుల నుంచి షిప్‌లు కదలడం లేదు. యుద్ధం మొదలై ఇప్పటికే 20 రోజులు దాటి పోయాయి. మళ్లీ స్టాక్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో లైవ్‌స్టాక్‌ను మెయింటైన్‌ చేయలేక ఫార్మ్స్‌ యజమానులు వాటిని ఉన్న పళంగా కబేళాలకు తరలిస్తున్నారు. మరో వారం పది రోజుల్లో యుద్ధం విషయంలో క్లారిటీ రాకపోతే పశువులను పెంచలేని పరిస్థితి నెలకొంటుందని పశువుల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read

TSRTC: తెలంగాణ ఆర్టీసీపై మరో పిడుగు.. కార్మికులు, ప్రయాణికులపై పడనున్న ప్రభావం..!

IND vs SL: భారత్, శ్రీలంక పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ అసంతృప్తి.. బిలో యావరేజ్ అంటూ..

మహారాష్ట్రలో ముదురుతున్న రాజకీయ వివాదం.. కేంద్రమంత్రికి నోటీసులు ఇచ్చిన బాంబే మున్సిపల్ కార్పొరేషన్