Pak-China: పాకిస్తాన్‌ – చైనా బంధానికి బీటలు.. పాక్‌ ముక్కుపిండి పరిహారం వసూలు చేసిన చైనా!

స్నేహం స్నేహమే... పరిహారం పరిహారమే అంటోంది చైనా. పాకిస్తాన్‌ నుంచి తమకు రావాల్సిన డబ్బును ముక్కు పిండి వసూలు చేసేందుకు రెడీ అయ్యింది. దాంతో, పాకిస్తాన్‌-చైనా బంధం బీటలు వారేలా కనిపిస్తోంది.

Pak-China: పాకిస్తాన్‌ - చైనా బంధానికి బీటలు.. పాక్‌ ముక్కుపిండి పరిహారం వసూలు చేసిన చైనా!
Pak China
Follow us

|

Updated on: Jan 24, 2022 | 7:04 AM

Pakistan paying Compensation to China Workers: స్నేహం స్నేహమే… పరిహారం పరిహారమే అంటోంది చైనా. పాకిస్తాన్‌ నుంచి తమకు రావాల్సిన డబ్బును ముక్కు పిండి వసూలు చేసేందుకు రెడీ అయ్యింది. దాంతో, పాకిస్తాన్‌-చైనా బంధం బీటలు వారేలా కనిపిస్తోంది.

శత్రువుకి శత్రువుకు మిత్రుడు అంటారు. ఈ సూత్రమే, చైనా, పాకిస్తాన్‌ను మిత్రులుగా మార్చింది. చైనా అండ్ పాకిస్తాన్ …ఉమ్మడి శత్రువు ఇండియా. ఈ రెండు దేశాల స్నేహం టార్గెట్‌ ఒక్కటే అది భారత్‌. ఇండియాకి బోర్డర్ దేశాలైన చైనా, పాకిస్తాన్‌లు భారత్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ అమలు చేయడమే పని. ఇండియాను ఇబ్బంది పెడుతూ పక్కలో బల్లెంలా వ్యవహరించడమే. భారత్‌ను దెబ్బతీసేందుకు అంతర్జాతీయంగానూ పాకిస్తాన్‌కు అండగా ఉంటూ వచ్చింది చైనా. అందుకే, చైనా అండ్ పాక్‌ను ఐరన్ బ్రదర్స్‌ అంటారు.

అలాంటి ఫెవికాల్‌ బంధానికి ఇప్పుడు బీటలు పడేలా కనిపిస్తోంది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటోంది చైనా. స్నేహం స్నేహమే న్యాయం న్యాయమే అంటూ పాకిస్తాన్‌కు ఊహించని ఝలక్‌ ఇచ్చింది. ఫ్రెండ్షిప్‌లో భాగంగా పాకిస్తాన్‌లో హైడ్రోపవర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు చేపట్టింది చైనా. 2021 జులై 14న ఇక్కడ ఉగ్రదాడి జరిగింది. ఈ ఎటాక్‌లో 36మంది చైనా కార్మికులు మరణించారు. ఇప్పుడు ఆ కార్మికుల కుటుంబాలకు 38 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలంటూ పాక్‌ను ముందు డిమాండ్ పెట్టింది చైనా. ఇండియన్ కరెన్సీ ప్రకారం 282కోట్లు. అంటే ఒక్కో ప్రాణానికి 2.3కోట్లు కట్టమంటోంది చైనా. ఇదే, ఇప్పుడు పాకిస్తాన్‌ను ఇరకాటంలో పెట్టింది. అసలే, విదేశీ కరెన్సీ నిల్వల్లేక, ప్రభుత్వాన్ని నడపలేక ఆర్ధిక కష్టాలతో ఇబ్బందులు పడుతోన్న పాకిస్తాన్‌కు ఇది ఊహించని షాక్‌లా తగిలింది. డబ్బులు కట్టేందుకు పాక్ మొండికేయడంతో డ్యామ్‌ పనుల్ని అర్ధాంతరంగా నిలిపివేసింది చైనా. దాంతో, చైనా అండ్ పాకిస్తాన్ స్నేహంపై నీలి నీడలు కమ్ముకున్నాయంటోంది అంతర్జాతీయ సమాజం.

గత జులైలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో పాక్‌ దీని తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రయత్నించింది. తొలుత ఇదో ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, చైనా సర్కారుకు చెందిన దర్యాప్తు బృందం నేరుగా ఘటనా స్థలాన్ని సందర్శించి.. ఆత్మాహుతి దాడిగా తేల్చింది. ఆ తర్వాత కూడా పాక్‌ మరోసారి తప్పించుకొనేందుకు ఈ దాడి బాధ్యతను భారత నిఘా సంస్థ ‘రా’పై మోపేందుకు ప్రయత్నించింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షామహమూద్‌ ఖురేషీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. భారత్‌, అఫ్గాన్‌ నిఘా వర్గాలు ఈ దాడి వెనుకాల ఉన్నాయని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారు. ఆ తర్వాత పాకిస్థాన్‌ తాలిబన్ల హస్తం ఉన్నట్లు తేలింది. దీంతో చచ్చినట్లు చైనా దర్యాప్తు బృందానికి పాక్ తలొగ్గింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చైనా కార్మికులకు నష్టపరిహారం చెల్లించక తప్పడంలేదు.

Read Also…  Team India: ‘ఫిట్’ మ్యాన్‌‌గా ఉంటేనే సారథిగా రాణిస్తాడు.. కోహ్లీ, రోహిత్‌లపై మాజీ హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!