AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drones Bans: అబుదాబి దాడులతో అప్రమత్తమైన ప్రభుత్వం.. డ్రోన్లపై నిషేధం..!

Drones Bans: ఇటీవల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)  రాజధాని అబుదాబి (Abu Dhabi)లో యెమన్‌ హుతీ తిరుగుబాటుదారులు..

Drones Bans: అబుదాబి దాడులతో అప్రమత్తమైన ప్రభుత్వం.. డ్రోన్లపై నిషేధం..!
Subhash Goud
|

Updated on: Jan 24, 2022 | 5:49 AM

Share

Drones Bans: ఇటీవల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)  రాజధాని అబుదాబి (Abu Dhabi)లో యెమన్‌ హుతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్‌, క్షిపణి దాడుల్లో ఇద్దరు ఇండియన్స్‌తో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన యూఏఈ సర్కార్‌.. స్థానికంగా నెల రోజులపాటు డ్రోన్‌లు, లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకకు అంతర్గత వ్యవహారాలశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమిరేట్స్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే నిషేధిత ప్రాంతాల్లోనూ డ్రోన్‌లను ఎగురవేస్తూ, వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశామని శాఖ స్పష్టం చేసింది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

డ్రోన్‌ల కోసం అనుమతి..

ఏదైనా అత్యవసరంగా డ్రోన్లను ఉపయోగించుకోవాల్సి వస్తే తప్పనిసరిగా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. యెమన్‌, సౌదీ ఆరేబియా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్దితులు నెలకొన్నాయని తెలిపింది. అయితే హుతీ తిరుబాటుదారుల అధీనంలోని యెమన్‌ రాజధాని సనాపై జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు. దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన ఎనిమిది డ్రోన్‌లను అడ్డుకున్నట్లు సైన్యం వెల్లడించింది. అనంతరం యెమన్​లోని సాదా జైలుపై జరిపిన వైమానిక దాడిలో 70 మందికి పైగా మరణించారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో డ్రోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

German Navy Chief: జర్మన్ నేవీ చీఫ్ రాజీనామా.. ఉక్రెయిన్, రష్యాపై భారత్‌లో చేసిన వ్యాఖ్యలే కారణమా!

Twitter CEO Parag Agrawal: ట్విట్టర్​లో పలువురి తొలగింపు.. ప్రక్షాళన ప్రారంభించిన పరాగ్‌ అగర్వాల్‌..