Omicron sub-variant: దడ పుట్టిస్తున్న కొత్త సబ్ వేరియంట్.. రెండు డోస్‌లు తీసుకున్నా కరోనా ఇన్ఫెక్షన్‌!

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. థర్డ్‌ వేవ్‌ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు లక్షలకు చేరాయి. రెండు డోసుల వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్‌ బారినపడుతున్నారు.

Omicron sub-variant: దడ పుట్టిస్తున్న కొత్త సబ్ వేరియంట్.. రెండు డోస్‌లు తీసుకున్నా కరోనా ఇన్ఫెక్షన్‌!
Corona
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 23, 2022 | 6:24 PM

Omicron sub-variant: దేశంలో కరోనా(Covid 19) కోరలు చాస్తోంది. థర్డ్‌ వేవ్‌ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు లక్షలకు చేరాయి. రెండు డోసుల వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్‌ బారినపడుతున్నారు. ఒమిక్రాన్‌(Omicron) జెట్ స్పీడ్‌తో విస్తరిస్తున్న వేళ సబ్ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది.

కరోనా మహమ్మారికి మరో రూపం B.1.1529గా పిలిచే ఒమిక్రాన్ వేరియంట్‌.. గత నెల డిసెంబర్‌లో BA.1, BA.2గా విడిపోయి ఎటాక్ చేస్తూనే ఉంది. వాటికి తోడు ఇప్పుడు సబ్‌ వేరియంట్‌ పుట్టుకొచ్చింది. దాన్ని రహస్య ఒమిక్రాన్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సబ్‌ స్ట్రెయిన్‌నూ బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. హెల్త్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో ఉంచి.. సమగ్ర పరిశోధనలు చేస్తోంది. విపత్కర పరిస్థితుల్లో కొత్త రకం ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనన్న ఆందోళన మొదలైంది.

వ్యాక్సిన్లతో పాటు బూస్టర్‌ డోస్‌లపై కూడా రకరకాల ప్రచారం నడుస్తోంది. ఫస్ట్, సెకండ్ డోస్ తర్వాత.. బూస్టర్‌ డోస్‌కి ముందు కొత్తగా అదనపు డోస్‌ను వేసుకోవాలంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇమ్యూనిటీ పవర్‌ తక్కువున్న వారికి ఈ డోస్ వేస్తే రక్షణగా ఉంటుందంటోంది. ఆంటే అలాంటి వాళ్లు నాలుగు డోసులు వేసుకోవాలన్నమాట.

ప్రస్తుత వ్యాక్సిన్లు ఏవీ కరోనా వ్యాప్తిని ఆపలేకపోతున్నాయి. ఒమిక్రాన్ విషయంలో వ్యాక్సిన్ల పనితీరు గతంతో పోలిస్తే తగ్గింది. అందుకే బూస్టర్‌ డోస్‌ మస్ట్‌ అంటోంది డబ్ల్యూహెచ్‌వో. రెండు డోసుల వ్యాక్సినేషన్‌తో పాటు ఒకసారి ఇన్‌ఫెక్షన్‌కు గురైతే హైబ్రిడ్ ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఒక డోసు టీకాతో పాటు రెండుసార్లు ఇన్‌ఫెక్షన్ సోకినా ఈ తరహా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అయితే బూస్టర్ డోస్‌లతో ఎలాంటి వైరస్‌నైనా ఎదుర్కోనే అవకాశం ఉంటుందన్నది డబ్ల్యూహెచ్‌ఓ అంచనా.

ఇదిలావుంటే, నిను వీడని నీడను నేనే అంటూ రోజుకో కొత్త వైరస్ పరేషాన్‌ చేస్తూనే ఉంది. ఈ వైరస్‌ ఫియర్‌ పోయేదెప్పుడు.. జనం ఊపిరి పీల్చుకునేదెప్పుడు?…

Read Also….  Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ ఖాళీకి మోక్షమెప్పుడు.. ఈటల స్థానం కోసం నేతల మధ్య పోటీ!