AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్..!

భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు ఆదివారం కరోనా సోకినట్లు గుర్తించారు. ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు.

Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్..!
Venkaiah
Balaraju Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 23, 2022 | 6:09 PM

Share

Vice President of India Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు ఆదివారం కరోనా సోకినట్లు గుర్తించారు. ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. ‘ఈరోజు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్‌లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి, ఒక వారం పాటు ఒంటరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. గతంలో తనను కలిసిన వారందరూ కూడా.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఉపరాష్ట్రపతి కోరారు.

ఇదిలావుంటే, వార్తా సంస్థ ANI ప్రకారం, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు మొత్తం 875 మంది కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అదే సమయంలో, రాజ్యసభ సెక్రటేరియట్‌లో ఇప్పటివరకు 271 మందికి కరోనా సోకింది.

సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ, నేతాజీ మాతృభూమి పట్ల నిస్వార్థ అంకితభావాన్ని ప్రదర్శించారని అన్నారు. ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా నాయుడు అభినందించారు. ఈమేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేశారు. “దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు బోస్‌కు రుణపడి, జాతికి నిస్వార్థ సేవ చేయడం పట్ల నేతాజీ అచంచలమైన ధైర్యాన్ని గౌరవించటానికి మేము ఈ రోజును పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటున్నాము.” అంటూ వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read Also…. Punjab Elections: తొలి జాబితాను ప్రకటించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్.. అమరీందర్ సింగ్ ఎక్కడి నుంచంటే?