Twitter CEO Parag Agrawal: ట్విట్టర్లో పలువురి తొలగింపు.. ప్రక్షాళన ప్రారంభించిన పరాగ్ అగర్వాల్..
ట్విట్టర్ సీఈఓగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్.. తమ సంస్థలో భారీ మార్పులు చేస్తున్నారు...
ట్విట్టర్ సీఈఓగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్.. తమ సంస్థలో భారీ మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలో కీలక పదవుల్లో ఉన్న కొంత మందిని పక్కకు పెట్టారు. భద్రతా విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్న పీటర్ జట్కో సహా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రింకీ సేథీ కూడా తొలగించినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో పరాగ్ తెలిపారు.
సంస్థను ఇకపై ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ లేఖలో పరాగ్ వివరించిన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నుంచి పరాగ్ అగర్వాల్ గత ఏడాది నవంబరులో సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
అప్పటి నుంచి కీలక పదవుల్లో ఉన్న వ్యక్తుల విషయంలో మార్పులు చేస్తున్నారు. చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా ఉన్న డాంట్లీ డేవిస్, ఇంజినీరింగ్ విభాగపు హెడ్ మైకేల్ మోంటానోను ఆ పదవుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ప్రైవసీ ఇంజినీరింగ్ హెడ్‌గా ఉన్న లీ కిస్నర్కు తాత్కాలికంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించారు.
Read Also.. Salary Overdraft: శాలరీ ఓవర్‌డ్రాఫ్ట్ అంటే ఏమిటో తెలుసా.. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే..