Digital Voter ID: డిజిటల్‌ ఓటర్ ఐడీ కార్డ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.. గుర్తింపు కార్డుగా ఎక్కడైనా పనిచేస్తుంది..

Digital Voter ID: ఇప్పుడు అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. పేపర్లన్నీ డిజిటల్‌గా మారుతున్నాయి. అది మీ ఆధార్ కార్డు కావొచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావొచ్చు.

Digital Voter ID: డిజిటల్‌ ఓటర్ ఐడీ కార్డ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.. గుర్తింపు కార్డుగా ఎక్కడైనా పనిచేస్తుంది..
Voter
Follow us
uppula Raju

|

Updated on: Jan 23, 2022 | 4:36 PM

Digital Voter ID: ఇప్పుడు అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. పేపర్లన్నీ డిజిటల్‌గా మారుతున్నాయి. అది మీ ఆధార్ కార్డు కావొచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావొచ్చు. ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు కూడా డిజిటల్‌లోకి వచ్చేసింది. ప్రజలు కూడా ఎంతకాలమని ఆ బ్లాక్ అండ్‌ వైట్‌ ఓటర్ ఐడీలు వాడుతారు.. దీంతో ఎన్నికల సంఘం ఓటర్‌ ఐడీని మార్చేసింది. ఈ కొత్త ఓటరు IDని e-EPIC అని పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

దీన్ని మొబైల్‌లో ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి. దానికంటే ముందు e-EPIC లేదా డిజిటల్ ఓటర్ ID కార్డ్ అంటే ఏంటో తెలుసుకోండి. e-EPIC అనేది సురక్షితమైన పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ లేదా PDF వెర్షన్. ఉదాహరణకు ఓటరు ID కార్డ్ హార్డ్ కాపీ లేదా ప్లాస్టిక్ కాపీని డిజిటల్ ఫార్మాట్‌లో చేస్తే అది e-EPIC కార్డు అవుతుంది. దీనిని మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లో సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ కొత్త రకం ఓటర్ కార్డును మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్‌లో ఉంచుకోవచ్చు. ఈ కార్డు కూడా ప్లాస్టిక్ ఓటరు గుర్తింపు కార్డు వలె ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. మీకు కావాలంటే మీరు PDF ప్రింట్ తీసుకొని కలర్‌ ఫుల్‌ ఓటరు ID కార్డును పొందవచ్చు. e-EPICని మూడు విధాలుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఓటరల్ పోర్టల్ నుంచి, మీరు https://voterportal.eci.gov.in/ కి వెళ్లాలి. మరొక మార్గం NVSP ద్వారా మీరు అందుకోసం https://nvsp.in/ సందర్శించాలి. మూడో మార్గం మొబైల్ యాప్ డౌన్‌లోడ్ ద్వారా.

NVSP ద్వారా మీ ఓటరు ID కార్డ్‌ని కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

1. https://www.nvsp.in/ సందర్శించండి డౌన్‌లోడ్ e-EPIC కార్డ్‌పై క్లిక్ చేయండి

2. లాగిన్ అయి కొత్త వినియోగదారుగా నమోదు చేసుకోండి

3. e-EPIC డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయండి

4. EPIC నంబర్ లేదా ఫారమ్ రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయండి

5. మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ధృవీకరించండి

6. ఇప్పుడు డౌన్‌లోడ్ e-EPICపై క్లిక్ చేయండి

7. మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయనట్లయితే e-KYCపై క్లిక్ చేసి KYCని పూర్తి చేయండి

8. ఇప్పుడు ఫేస్ లైవ్‌నెస్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి

9. KYCని పూర్తి చేయడానికి మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి

10. చివరగా మీ e-EPICని డౌన్‌లోడ్ చేసుకోండి

IND vs SA, 3rd ODI, LIVE Cricket Score: 30 ఓవర్లకు సౌతాఫ్రికా 170/3.. క్వింటన్‌ డికాక్‌ సెంచరీ..

Viral Photos: హరిద్వార్ పవిత్రమైన స్నానానికే కాదు.. ఈ ప్రదేశాలకు కూడా చాలా ఫేమస్..

అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగితే ఏ నెంబర్లకు కాల్‌ చేయాలి.. నెట్‌వర్క్‌ లేకపోతే ఏం చేయాలి..?

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి