IND vs SA, 3rd ODI Highlights: భారత్ 283 పరుగులకు ఆలౌట్‌.. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం

|

Updated on: Jan 23, 2022 | 10:56 PM

IND vs SA, 2nd ODI, Highlights: భారత్ ఇప్పటికే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈరోజు సిరీస్‌లో చివరి మ్యాచ్‌ కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో జరగనుంది.

IND vs SA, 3rd ODI Highlights: భారత్ 283 పరుగులకు ఆలౌట్‌..  4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
Ind Vs Sa, 3rd Odi

Highlights: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో జరుగుతున్న చివరి వన్డేలో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు విజయం నీదా నాదా అనే రేంజ్‌లో మ్యాచ్‌ కొనసాగింది. ఒక దశలో భారత్ గెలుస్తుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా భారత్ ఆలౌట్‌ అయింది. ఉత్కంఠగా జరిగిన పోరులో సౌతాఫ్రికా విక్టరీ సాధించి సిరీస్‌ని క్లీన్ స్వీప్‌ చేసింది.

288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెఎల్‌ రాహుల్ 9 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ శిఖర్ ధావన్, విరాట్‌ కోహ్లీ రెండో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు బాధ్యతని భుజాలపై మోస్తూ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 61 పరుగులు (73 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్‌) ఔటయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ 65 పరుగులు (84 బంతుల్లో 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. వీరి తర్వాత మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు పర్వాలేదనిపించినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

చివరగా దీపక్‌ చాహర్ అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. బుమ్రాతో కలిసి ఎనిమిదో వికెట్‌కి 28 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంచుమించు భారత్‌ని విజయతీరాలవరకు చేర్చాడు. కానీ చివరలో ఔట్‌ కావడంతో మ్యాచ్‌ సౌతాఫ్రికా వైపు మళ్లింది. చివరి ఓవర్లో 7 బంతుల్లో 6 పరుగులు కావాలి. కానీ యజ్వేంద్ర చాహల్ అవుట్ కావడంతో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 3, లుంగి ఎంగిడి3, ప్రిటోరియా 2, కేశవ్ మహరాజ్ 1, సిసందా మగల1 వికెట్‌ చొప్పున సాధించారు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన సౌతాఫ్రికాకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జానెమన్ మలన్ చాహర్ బౌలింగ్‌లో1 పరుగుకే ఔటయ్యాడు. తర్వాత టెంబా బావుమాని రాహుల్ రనౌట్ చేశాడు. మార్‌క్రమ్‌ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో భారమంతా క్వింటన్ డి కాక్, రస్పెన్‌ వాన్‌ డస్సెన్ పై పడింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కి సెంచరీ పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే డి కాక్ సెంచరీ పూర్తి చేశాడు. 130 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. డస్సెన్ 59 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. వీరిద్దరు ఔట్‌ అయ్యాక ఎవ్వరు పెద్దగా రణించలేదు. చివరలో ఒక్క డేవిడ్‌ మిల్లర్ 39 పరుగులతో (38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనిపించాడు. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే 287 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, దీపక్ చాహర్ 2, బుమ్రా 2, యజ్వేంద్ర చాహల్ 1 వికెట్ సాధించారు.

జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): జాన్నెమన్ మలాన్, క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, డ్వైన్ ప్రిటోరియస్, లుంగీ ఎన్‌గిడి, సిసంద మగల

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jan 2022 10:23 PM (IST)

    భారత్ 283 పరుగులకు ఆలౌట్‌..

    భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్‌ అయింది. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. మూడో వన్డేలో కూడా ఓటమిని మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది.

  • 23 Jan 2022 10:17 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్

    భారత్ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా 12 పరుగులకు ఔటయ్యాడు. పెహ్లువయో బౌలింగ్‌లో బావుమా క్యాచ్‌ తీసుకోవడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 8 బంతుల్లో 7 పరుగులు కావాలి. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది.

  • 23 Jan 2022 10:11 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్

    భారత్ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. దీపక్ చాహర్ 54 పరుగులకు ఔటయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో ప్రిటోరియాస్ క్యాచ్‌ తీసుకోవడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 15 బంతుల్లో 9పరుగులు చేయాలి. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 2, లుంగి ఎంగిడి3, కేశవ్ మహరాజ్ 1, సిసందా మగల1, ప్రిటోరియా 1 వికెట్‌ చొప్పున సాధించారు.

  • 23 Jan 2022 10:06 PM (IST)

    ఎనిమిదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం

    దీపక్ చాహర్ 54 పరుగులు, బుమ్రా 7 పరుగులు కలిసి ఎనిమిదో వికెట్‌కి 28 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్‌ని విజయం వైపునకు తీసుకెళతున్నారు. విజయానికి మరో 14 పరుగులు కావాలి

  • 23 Jan 2022 10:05 PM (IST)

    హాఫ్ సెంచరీ సాధించిన దీపక్ చాహర్

    దీపక్ చాహర్ హాఫ్ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. దీంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 17 పరుగుల దూరంలో నిలిచింది.

  • 23 Jan 2022 09:51 PM (IST)

    250 పరుగులు దాటిన భారత్

    భారత్ 44.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. క్రీజులో దీపక్ చాహర్ 37 పరుగులు, జస్ప్రీత్ బుమ్ర 5 పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయానికి 33 బంతుల్లో 37 పరుగులు కావాలి.

  • 23 Jan 2022 09:39 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్

    భారత్ ఏడో వికెట్‌ కోల్పోయింది. జయంత్ యాదవ్ 2 పరుగులకు ఔటయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో బావుమా క్యాచ్‌ పట్టాడు. దీంతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 47 బంతుల్లో 65 పరుగులు కావాలి. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 2, లుంగి ఎంగిడి2, కేశవ్ మహరాజ్ 1, సిసందా మగల1, ప్రిటోరియా 1 వికెట్‌ చొప్పున సాధించారు.

  • 23 Jan 2022 09:29 PM (IST)

    40 ఓవర్లలో భారత్ 210/6

    భారత్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో దీపక్ చాహర్ 4 పరుగులు, జయంత్ యాదవ్ 0 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 58 బంతుల్లో 70 పరుగులు కావాలి. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 2, లుంగి ఎంగిడి1, కేశవ్ మహరాజ్ 1, సిసందా మగల1, ప్రిటోరియా 1 వికెట్‌ చొప్పున సాధించారు.

  • 23 Jan 2022 09:27 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్

    భారత్ ఆరో వికెట్‌ కోల్పోయింది. సూర్యకుమార్‌ యాదవ్ 39 పరుగులకు ఔటయ్యాడు. ప్రిటోరియస్ బౌలింగ్‌లో బావుమా క్యాచ్‌ తీసుకోవడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 61 బంతుల్లో 78 పరుగులు కావాలి. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 2, లుంగి ఎంగిడి1, కేశవ్ మహరాజ్ 1, సిసందా మగల1 వికెట్‌ చొప్పున సాధించారు.

  • 23 Jan 2022 09:16 PM (IST)

    200 పరుగులు దాటిన భారత్

    భారత్ 37.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు దాటింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు, దీపక్ చాహర్ 1 పరుగుతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 74 బంతుల్లో 88 పరుగులు కావాలి.

  • 23 Jan 2022 09:14 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ ఐదో వికెట్‌ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ 26 పరుగులకు ఔటయ్యాడు. మగల బౌలింగ్‌లో పెహ్లువియా క్యాచ్‌ తీసుకోవడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 77 బంతుల్లో 93 పరుగులు కావాలి. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 2, లుంగి ఎంగిడి1, కేశవ్ మహరాజ్ 1, సిసందా మగల1 వికెట్‌ చొప్పున సాధించారు.

  • 23 Jan 2022 08:40 PM (IST)

    30 ఓవర్లలో భారత్ 152/3

    భారత్ 30 ఓవరల్లో మూడు వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 64 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 13 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 136 పరుగులు కావాలి. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 2, లుంగి ఎంగిడిలకు1 వికెట్‌ చొప్పున సాధించారు.

  • 23 Jan 2022 08:22 PM (IST)

    విరాట్‌ కోహ్లీ హాఫ్ సెంచరీ

    విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. 63 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో భారత్ 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 162 పరుగుల దూరంలో నిలిచింది.

  • 23 Jan 2022 08:18 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ మూడో వికెట్‌ కోల్పోయింది. రిషబ్‌ పంత్ డకౌట్‌ అయ్యాడు. పెహ్లక్‌ బౌలింగ్‌లో మగల క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 169 పరుగుల దూరంలో నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 2, లుంగి ఎంగిడిలకు1 వికెట్‌ చొప్పున సాధించారు. శ్రేయస్‌ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.

  • 23 Jan 2022 08:11 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ రెండో వికెట్‌ కోల్పోయింది. శిఖర్ ధావన్ 61 పరుగులకు ఔటయ్యాడు. పెహ్లక్‌ బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ తీసుకోవడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 172 పరుగుల దూరంలో నిలిచింది. కాగా ధావన్, కోహ్లీ రెండో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులోకి రిషబ్ పంత్‌ వచ్చాడు.

  • 23 Jan 2022 08:00 PM (IST)

    20 ఓవర్లకు భారత్ 107/1

    20 ఓవర్లలో భారత్ ఒక వికెట్‌ నష్టపోయి 107 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 56 పరుగులు, కోహ్లీ 38 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. విజయానికి ఇంకా 181 పరుగులు చేయాలి.

  • 23 Jan 2022 07:56 PM (IST)

    100 పరుగులు దాటిన భారత్

    భారత్ 18.4 ఓవరల్లో ఒక వికెట్‌ నష్టపోయి 101 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 53 పరుగులు, విరాట్ కోహ్లీ 35 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 213 పరుగులు కావాలి.

  • 23 Jan 2022 07:53 PM (IST)

    శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ

    శిఖర్ ధావన్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. 58 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్‌ సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఒక వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ 27 పరుగులతో ఆడుతున్నాడు. విజయానికి ఇంకా 199 పరుగులు చేయాల్సి ఉంది.

  • 23 Jan 2022 07:39 PM (IST)

    15 ఓవర్లకు భారత్ 75/1

    15 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 42 పరుగులు, విరాట్ కోహ్లీ 21 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 213 పరుగులు కావాలి.

  • 23 Jan 2022 06:55 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్‌

    భారత్ తొలి వికెట్‌ కోల్పోయింది. కెఎల్ రాహుల్ 9 పరుగులకు ఔటయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో మలన్ క్యాచ్‌ పట్టడంతో ఔట్‌ అయ్యాడు. దీంతో ఒక వికెట్‌ నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు.

  • 23 Jan 2022 06:37 PM (IST)

    బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇండియా

    288 పరుగుల లక్ష్యంతో టీం ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా కెఎల్‌ రాహుల్, శిఖర్ ధావన్‌ వచ్చారు.

  • 23 Jan 2022 06:07 PM (IST)

    సౌతాఫ్రికా 287 పరుగులక ఆలౌట్‌..

    సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్‌కి 288 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. సౌతాఫ్రికా ఆటగాళ్లలో క్వింటన్ డి కాక్ సెంచరీతో రాణించగా, రస్సెన్ వాన్‌ డస్సెన్ హాఫ్ సెంచరీ, డేవిడ్‌ మిల్లర్‌ 39 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, దీపక్ చాహర్ 2, బుమ్రా 2, యజ్వేంద్ర చాహల్ 1 వికెట్ సాధించారు.

  • 23 Jan 2022 06:03 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. డేవిడ్‌ మిల్లర్ 39 పరుగులకు ఔటయ్యాడు. ప్రసిద్ద్‌ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. క్రీజులోకి లుంగి ఎంగిడి వచ్చాడు.

  • 23 Jan 2022 05:59 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కేశరాజ్‌ మహరాజ్ 6 పరుగులకు ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. క్రీజులోకి సిసందా మగలా వచ్చాడు.

  • 23 Jan 2022 05:52 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. డ్వేన్‌ ప్రిటోరియస్‌ 20 పరుగులకు ఔటయ్యాడు. ప్రసిద్ద్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్రీజులోకి కేశరాజ్‌ మహారాజ్ వచ్చాడు.

  • 23 Jan 2022 05:33 PM (IST)

    250 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్‌ మిల్లర్ 20 పరుగులు, డ్వేన్‌ ప్రిటోరియస్‌ 13 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు, బుమ్రా 1, యజ్వేంద్ర చాహల్ 1 వికెట్ సాధించారు.

  • 23 Jan 2022 05:22 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. ఆండ్లే పెహులుక్ వాయో 4 పరుగులకు ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ రనౌట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజులోకి డ్వేన్‌ ప్రిటోరియస్‌ వచ్చాడు.

  • 23 Jan 2022 05:14 PM (IST)

    40 ఓవర్లకు సౌతాఫ్రికా 228/5

    సౌతాఫ్రికా 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్ 7 పరుగులు, ఆండ్లే పెహులుక్ వాయో 4 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు, బుమ్రా 1, యజ్వేంద్ర చాహల్ 1 వికెట్ సాధించారు.

  • 23 Jan 2022 05:03 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. వాన్‌ డస్సెన్ 52 పరుగులకు ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.

  • 23 Jan 2022 04:56 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. క్వింటన్ డికాక్ 124 పరుగులకు ఔటయ్యాడు. బుమ్ర బౌలింగ్‌లో ధావన్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. క్రీజులోకి డేవిడ్‌ మిల్లర్ వచ్చాడు.

  • 23 Jan 2022 04:44 PM (IST)

    200 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 34.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజులో డి కాక్ 119 పరుగులు, వాన్‌ డస్సెన్ 50 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు సాధించాడు.

  • 23 Jan 2022 04:43 PM (IST)

    హాఫ్ సెంచరీ సాధించిన రస్సెన్ వాన్‌ డస్సెన్

    రస్సెన్ వాన్‌ డస్సెన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 53 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్‌ సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. మరోవైపు క్రీజులో క్వింటన్ డి కాక్ 111 పరుగులతో విజృంభిస్తున్నాడు.

  • 23 Jan 2022 04:29 PM (IST)

    నాలుగో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం

    క్వింటన్ డి కాక్ 101 పరుగులు, రస్సెన్ వాన్ డస్సెన్ 40 పరుగులు నాలుగో వికెట్‌కి 108 బంతుల్లో 100 పరుగులు జోడించారు. దీంతో సౌతాఫ్రికా 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

  • 23 Jan 2022 04:28 PM (IST)

    క్వింటన్‌ డికాక్‌ సెంచరీ..

    సౌతాఫ్రికా వికెట్‌ కీపర్ క్వింటన్ డి కాక్ సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. రెండో వన్డేలో కూడా డి కాక్ 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. మరోవైపు క్రీజులో రస్సెన్ వాన్‌ డస్సెన్ 40 పరుగులతో చక్కటి సహకారం అందిస్తున్నాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు సాధించాడు.

  • 23 Jan 2022 04:21 PM (IST)

    30 ఓవర్లకు సౌతాఫ్రికా 170/3

    సౌతాఫ్రికా 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డి కాక్ 99 పరుగులు, రస్సెన్ వాన్ డస్సెన్ 39 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు సాధించాడు.

  • 23 Jan 2022 04:12 PM (IST)

    150 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో డి కాక్ 92 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరోవైపు డస్సెన్ 32 పరుగులతో ఆడుతున్నాడు.

  • 23 Jan 2022 03:51 PM (IST)

    నాలుగో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం

    క్వింటన్ డి కాక్ 73 పరుగులు, రస్సెన్ వాన్ డస్సెన్ 17 పరుగులు నాలుగో వికెట్‌కి 59 బంతుల్లో 50 పరుగులు జోడించారు. దీంతో సౌతాఫ్రికా 22 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.

  • 23 Jan 2022 03:43 PM (IST)

    20 ఓవర్లకు సౌతాఫ్రికా 103/3

    సౌతాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డి కాక్ 58 పరుగులు, రస్సెన్ వాన్ డస్సెన్ 15 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు సాధించాడు.

  • 23 Jan 2022 03:42 PM (IST)

    100 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 19 ఓవర్లలో 100 పరుగులు దాటింది. క్వింటన్‌ డి కాక్ 58 పరుగులు, రస్సెన్‌ వాన్‌ డస్సెన్ 15 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు సాధించాడు.

  • 23 Jan 2022 03:37 PM (IST)

    క్వింటన్‌ డి కాక్‌ హాఫ్ సెంచరీ..

    సౌతాఫ్రికా వికెట్‌ కీపర్ క్వింటన్ డి కాక్ హాఫ్ సెంచరీ సాధించాడు. 63 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. రెండో వన్డేలో కూడా డి కాక్ 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. మరోవైపు క్రీజులో రస్సెన్ వాన్‌ డస్సెన్ 14 పరుగులతో చక్కటి సహకారం అందిస్తున్నాడు.

  • 23 Jan 2022 03:10 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. మార్‌క్రమ్ 15 పరుగులకు ఔటయ్యాడు. చాహర్ బౌలింగ్‌లో రూత్‌రాజ్‌ గైక్వాడ్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులోకి రస్సెన్ వాన్‌ డస్సెన్ వచ్చాడు.

  • 23 Jan 2022 02:53 PM (IST)

    50 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్‌ డికాక్‌ 34 పరుగులు, మార్‌క్రమ్ 9 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. భారత బౌలర్లలో దీపక్‌ చాహర్‌కి 1 వికెట్‌ దక్కింది.

  • 23 Jan 2022 02:36 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్ టెంబా బావుమా 8 పరుగులకు ఔటయ్యాడు. రాహుల్‌ రనౌట్‌ చేయడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులోకి మార్‌క్రమ్‌ వచ్చాడు.

  • 23 Jan 2022 02:14 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    మలాన్ (1) రూపంలో సౌతాఫ్రికా టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. దీపర్ చాహర్ బౌలింగ్‌లో మలాన్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో సౌతాఫ్రికా టీం 2.1 ఓవర్లకు 8 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 23 Jan 2022 02:01 PM (IST)

    మొదలైన సౌతాఫ్రికా బ్యాటింగ్

    చివరి వన్డేలో టాస్ ఓడిపోయిన సౌతాఫ్రికా టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, జన్నీమన్ మలాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. దీపక్ చాహర్ తొలి ఓవర్‌ను బౌలించే చేస్తున్నాడు.

  • 23 Jan 2022 01:51 PM (IST)

    టాస్ గెలిచిన టీమిండియా

    కీలకమైన మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకంది. దీంతో సౌతాఫ్రికా టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. 4 కీలక మార్పులతో టీమిండియా చివరి వన్డేల్లో బరిలోకి దిగనుంది. సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్ టీంలోకి ఎంట్రీ ఇచ్చారు.

  • 23 Jan 2022 01:39 PM (IST)

    భారత్ ప్లేయింగ్ XI

    భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

  • 23 Jan 2022 01:39 PM (IST)

    దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI

    దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): జాన్నెమన్ మలాన్, క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, డ్వైన్ ప్రిటోరియస్, లుంగీ ఎన్‌గిడి, సిసంద మగల

  • 23 Jan 2022 01:33 PM (IST)

    క్లీన్‌స్వీప్ ముప్పు..

    2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 5-1తో విజయం సాధించింది. అయితే ఈసారి క్లీన్ స్వీప్ ముప్పును టీమిండియా ఎదుర్కొంటోంది.

  • 23 Jan 2022 01:33 PM (IST)

    ప్లేయింగ్ XIలో మార్పు వచ్చే అవకాశాలు..

    నేటి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు చోటు చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని, భువనేశ్వర్ కుమార్‌ను ఈరోజు జట్టు నుంచి తప్పించాలని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.

  • 23 Jan 2022 01:32 PM (IST)

    భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే..

    భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా నేడు కేప్‌టౌన్ వేదికగా చివరి మ్యాచ్ జరుగుతోంది. సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే 0-2తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది.

Published On - Jan 23,2022 1:29 PM

Follow us