IPL-2022 Mega Auction: మెగా వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాచైజీలు.. ఎవరి వద్ద ఎంత డబ్బు ఉందంటే..

IPL-2022 Mega Auction: మెగా వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాచైజీలు.. ఎవరి వద్ద ఎంత డబ్బు ఉందంటే..
ipl

ఐపీఎల్-2022 మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ఫిబ్రవరి 12, 13న మెగావేలం జరగనుంది...

Srinivas Chekkilla

|

Jan 23, 2022 | 1:35 PM

ఐపీఎల్-2022 మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ఫిబ్రవరి 12, 13న మెగావేలం జరగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి.

ఈసారి వేలంలో పాల్గొనబోయే పూర్తి ఆటగాళ్ల జాబితా వచ్చింది. మొత్తం ఈ ఏడాది లీగ్ కోసం 1,214 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ జట్లు ఎవరిని రిటైన్ చేసుకున్నాయి, ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత నగదు మిగిలి ఉందో చూద్దాం

చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా రూ. 16 కోట్లు, ధోనీ రూ. 12 కోట్లు, మొయిన్ అలీ రూ.8 కోట్లు, రుతురాజ్ రూ.6 కోట్లతో రిటైన్ చేసుకుంది. దీంతో చెన్నై వద్ద ఇంకా రూ.48 కోట్ల నగదు మిగిలి ఉంది.

సన్​రైజర్స్ హైదరాబాద్ విలియమ్సన్ రూ. 14 కోట్లు, అబ్దుల్ సమద్ రూ. 4 కోట్లు, ఉమ్రన్ మాలిక్ రూ. 4 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఎస్ఆర్​హెచ్ వద్ద ఇంకా రూ.68 కోట్లు మిగిలి ఉన్నాయి.

పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ రూ. 14 కోట్లు, అర్షదీప్ సింగ్ రూ. 4 కోట్ల రిటెన్షన్స్​తో పంజాబ్ వద్ద ఇంకా రూ.72 కోట్ల నగదు మిగిలి ఉంది.

ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మ రూ. 16 కోట్లు, బుమ్రా రూ.12 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ రూ. 8 కోట్లు, పొలార్డ్ రూ. 6 కోట్లతో రిటైన్ చేసుకుంది. ముంబై వద్ద ఇంకా రూ.48 కోట్లు మిగిలాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ రూ. 15 కోట్లు, మ్యాక్స్​వెల్ రూ. 11 కోట్లు, మహ్మద్ సిరాజ్ రూ. 7 కోట్లతో ఈ రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ వద్ద ఇంకా రూ.57 కోట్ల నగదు మిగిలి ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ రూ. 16 కోట్లు, అక్షర్ పటేల్ రూ. 9 కోట్లు, పృథ్వీ షా రూ. 7.5 కోట్లు, నోర్జ్టే రూ. 6.5 కోట్లతో ఢిల్లీ వద్ద ఇంకా రూ.47.5 కోట్లు మిగిలి ఉన్నాయి.

కోల్​కతా నైట్​రైడర్స్ రసెల్ రూ. 12 కోట్లు, వరుణ్ చక్రవర్తి రూ. 8 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ రూ. 8 కోట్లు, సునీల్ నరైన్ 6 కోట్లతో రిటైన్ చేసుకోగా.. ఆ ఫ్రాచైజీ వద్ద రూ.48 కోట్ల నగదు మిగిలి ఉంది.

రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్ రూ. 14 కోట్లు, బట్లర్ – 10 కోట్లు, యశస్వి జైస్వాల్ రూ. 4 కోట్లతో రిటైన్ చేసుకోగా ఆ జట్టు వద్దు ఇంకా రూ.62 కోట్లు ఉన్నాయి.

లక్నో కేఎల్ రాహుల్ రూ. 17 కోట్లు, స్టోయినిస్ రూ. 9.5 కోట్లు, రవి బిష్ణోయ్ రూ. 4కోట్లుకు తీసుకోగా.. లక్ననో వద్ద ఇంకా రూ.60 కోట్ల నగదు మిగిలి ఉంది.

అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యా రూ. 15 కోట్లు, రషీద్ ఖాన్ రూ.15 కోట్లు, శుభ్​మన్ గిల్ రూ. 7 కోట్లకు తీసుకోగా ఆ జట్టు వద్ద ఇంకా రూ.53 కోట్ల నగదు మిగిలి ఉంది.

Read Also.. Tom Latham And Daryl Mitchell: మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లాథమ్, మిచెల్.. ఎన్ని పరుగులు చేశారంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu