AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tom Latham And Daryl Mitchell: మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లాథమ్, మిచెల్.. ఎన్ని పరుగులు చేశారంటే..

న్యూజిలాండ్ బ్యాటర్లు టామ్ లాథమ్, డారిల్ మిచెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 టోర్నమెంట్​లో ఒటాగో, కాంటర్‌బరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో కాంటర్​బరీ విజయం సాధించింది...

Tom Latham And Daryl Mitchell: మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లాథమ్, మిచెల్.. ఎన్ని పరుగులు చేశారంటే..
Latham
Srinivas Chekkilla
|

Updated on: Jan 23, 2022 | 12:58 PM

Share

న్యూజిలాండ్ బ్యాటర్లు టామ్ లాథమ్, డారిల్ మిచెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 టోర్నమెంట్​లో ఒటాగో, కాంటర్‌బరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో కాంటర్​బరీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒటాగో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఒటాగో తరఫున డేల్ ఫిలిప్స్ 34 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అతను తప్ప జట్టులో మరే ఇతర బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు.

186 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కాంటర్‌బరీ 17 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. టామ్ లాథమ్, డారిల్ మిచెల్ తుఫాను ఇన్నింగ్స్‌తో కాంటర్​బరీ గెలుపొందింది. టామ్ లాథమ్ కేవలం 35 బంతుల్లో 66 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో డారిల్ మిచెల్ 39 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.

Read Also… Joint Home Loan: ఉమ్మడి హోం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..