Joint Home Loan: ఉమ్మడి హోం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే సొంత ఇల్లు అనేది అధిక వ్యయంతో కూడుకున్న విషయం...
సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే సొంత ఇల్లు అనేది అధిక వ్యయంతో కూడుకున్న విషయం. ఇల్లు కట్టే వారు దాదాపు హోం లోన్ తీసుకుంటారు. ఈ రోజుల్లో గృహ రుణం తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. అయితే దీనికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉండాలి. గృహ రుణాన్ని విడిగా కాకుండా ఉమ్మడిగా కూడా తీసుకోవచ్చు.
అయితే జాయింట్ హోం లోన్‌లో మంచి, చెడు రెండూ ఉంటాయి. ఉమ్మడి గృహ రుణం తీసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సహ గ్యారెంటర్‌ని కలిగి ఉండటం వల్ల అధికంగా రుణం వచ్చే ప్రయోజనం ఉన్నప్పటికీ, గృహ కొనుగోలుదారు ఉమ్మడి గృహ రుణాన్ని పొందడం వల్ల కలిగే నష్టాలను పరిగణలోకి తీసుకోవాలి.
జాయింట్ హోం లోన్ తీసుకుని ఇంటిని సొంతం చేసుకోవడం మంచి ఆలోచనగానే అనిపిస్తుంది. ఇది రుణ చెల్లింపుపై భారాన్ని తగ్గిస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిపి రుణం తీసుకోవడం ద్వారా మీరు అన్ని సౌకర్యాలున్న అధిక ధర ఇంటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలపై రాయితీలను కూడా ఇస్తున్నాయి. సాధారణంగా బ్యాంకులు కూడా సహ-ధరఖాస్తుదారు, సహ-యజమానిగా ఉండాలని సూచిస్తున్నాయి. ఉమ్మడి గృహ రుణం ధరఖాస్తుదారులిద్దరికీ పూర్తి బాధ్యతతో వస్తుంది. వారిలో ప్రతి ఒక్కరు తన షేర్‌ని చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి గృహ రుణంతో మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడనప్పటికీ, భాగస్వామి తన రుణ వాటాను చెల్లించడానికి నిరాకరిస్తే, అది ఇద్దరి క్రెడిట్ స్కోర్‌ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
చెల్లింపుల్లో డిఫాల్ట్స్ ఎక్కువ భాగం సహ-దరఖాస్తుదారులతో జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నా డిఫాల్ట్ అయ్యే అవకాశాలుంటున్నారు. భర్యాభర్తలు ఉమ్మడి గృహ రుణం పొందిన తర్వాత భవిష్యత్తులో వారు విడిపోవాలని నిర్ణయించుకుంటే రుణాన్ని తిరిగి చెల్లించడం సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే భార్యభర్తలు ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.
దురదృష్టవశాత్తు జీవిత భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే, బకాయి చెల్లింపును క్లియర్ చేసే భారం జీవించి ఉన్న భాగస్వామిపై పడుతుంది. రుణం తిరిగి చెల్లించని పక్షంలో నియమ నిబంధనల ప్రకారం బ్యాంకులు సహ-ధరఖాస్తుదారు ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
Read Also.. Jio 5G Network: దేశంలోని 1000 ప్రధాన నగరాల్లో జియో 5జీ.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న జియో..