Pan Card: పాన్ కార్డును అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు PAN కార్డు (శాశ్వత ఖాతా సంఖ్య) ముఖ్యమైంది. 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ పాన్ వస్తుంది.
అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు PAN కార్డు (శాశ్వత ఖాతా సంఖ్య) ముఖ్యమైంది. 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ పాన్ వస్తుంది. ఒక వ్యక్తి లేదా కంపెనీల పన్ను అంచనా వేయడానికి అవసరమైన అన్ని ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి PAN కార్డ్ ఆదాయపు పన్ను అథారిటీకి సహాయపడుతుంది.
అయితే కొన్నిసార్లు కార్డు హెల్డర్లు ఇళ్లు మారుతుంటారు. లేకుంటే కొందరి ఇంటి పేరు తప్పుగా వస్తుంది. లేకుంటే పెళ్లైన అమ్మాయికి ఇంటి పేరు మారుతుంది. ఇలా పాన్ కార్డులో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చొని పాన్ కార్డ్‌లో ఇంటిపేరు మార్చుకునే పూర్తి ప్రక్రియ గురించి తెలుసుకుంద్దాం..
పాన్ కార్డ్‌లో ఇంటిపేరు మార్చుకునే ప్రక్రియ
- ముందుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ https://nsdl.co.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- ‘ఎగ్జిస్టింగ్ పాన్‌లో కరెక్షన్’ ఎంపికను ఎంచుకోవాలి.
- టైప్‌ను ఎంపికను ఎంచుకోవాలి.
- పత్రాలను సరైన పేరు, సరైన స్పెల్లింగ్‌తో జత చేయాలి.
- చిరునామా లేదా ఇంటిపేరు మార్పు కోసం, కార్డుదారులు రూ. 110 చెల్లించాలి.
- ఎన్‌ఎస్‌డిఎల్ చిరునామాలో సబ్‌మిట్ ఆప్షన్ / సెండ్ అప్లికేషన్‌ని ఇన్‌కమ్ ట్యాక్స్ పాన్ సర్వీసెస్ యూనిట్ (ఎన్‌ఎస్‌డిఎల్ ఇ-
- గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్)ను క్లిక్ చేయండి.
- అప్‌డేట్ చేయబడిన పాన్ కార్డ్ దరఖాస్తు చేసిన తేదీ నుండి 45 రోజులలోపు నమోదిత చిరునామాకు పంపాలి.
మార్చి 31 వరకు చివరి అవకాశం
పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2022గా నిర్ణయించారు. మార్చి 31 గడువులోగా అలా చేయకపోతే వారి పాన్ కార్డ్ చెల్లదు. పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయని వారు రూ 1000 జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234హెచ్‌ని చేర్చారు.
Read Also.. Jio 5G Network: దేశంలోని 1000 ప్రధాన నగరాల్లో జియో 5జీ.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న జియో..