Ganguly vs Kohli: భారత క్రికెట్లో ఏం జరుగుతుంది.. ఆ వివాదానికి ముగింపు పలకాల్సిందేనా..
సౌరవ్ గంగూలీ భారత క్రికెట్తు ఒక ఐకాన్‌గా నిలిచిన వ్యక్తి . అతని నాయకత్వ లక్షణాలు అతని సహచరులకు సుపరిచితమే. గంగూలీ ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు.
సౌరవ్ గంగూలీ భారత క్రికెట్తు ఒక ఐకాన్‌గా నిలిచిన వ్యక్తి. అతని నాయకత్వ లక్షణాలు అతని సహచరులకు సుపరిచితమే. గంగూలీ ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. అతను 2000లో కెప్టెన్‌గా మారిన సమయం నుంచి 2005 వరకు కెప్టెన్‌గా రాణించాడు. 15 ఏళ్ల తర్వాత కూడా చాలా మంది భారతీయులు ఇప్పటికీ సౌరవ్ గంగూలీని గుర్తుంచుకుంటారు.
ప్రస్తుతం అతను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఛైర్మన్‌గా ఉన్నాడు. అధ్యక్షుడిగా విజయవంతం అయ్యాడా అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. గంగూలీ, కోహ్లీ వివాదం ఇక్కడ ప్రధానంగా తెరపైకి వస్తుంది. మీడియా ముందు మాట్లాడినందుకు విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని గంగూలీ భావించినట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి.
అయితే తాను అలాంటిదేమీ ఆలోచించలేదని గంగూలీ ఖండించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఇప్పుడు చూపించాల్సింది మెచ్యూరిటీ, కోహ్లీకి షోకాజ్ నోటీసు కాదని పలువులు అంటున్నారు. భారతదేశానికి అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరు BCCI అధ్యక్షుడైనప్పుడు, అతను సున్నితంగా ఉంటాడని, బహుశా ఆటగాళ్ల విషయంలో పాక్షికంగా కూడా ఉంటాడని ఎవరైనా ఆశిస్తారని చెబుతున్నారు.
కోరి తెచ్చుకున్న గ్రెగ్ చాపెల్ నిర్ణయం వల్ల గంగూలీ జట్టు నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కానీ గంగూలీ మాత్రం కోహ్లీని డీల్ చేయడంలో సెన్సిటివ్‌గా ఉన్నాడు. మరోవైపు సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు విఫలమవడంపై విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పులో బోర్డు సరిగా వ్యవహరించలేదని ఆరోపణలు వస్తున్నాయి.
గంగూలీ, కోహ్లి మధ్య మాటల వాగ్వివాదంతో పర్యటన ప్రారంభమైంది. ఈ వివాదం కోహ్లీని కెప్టెన్సీ నుండి తొలగించడమే కాకుండా, దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌ని గెలవాలనే ఆశను నీరుగార్చింది. ఒక ముఖ్యమైన పర్యటనకు ముందు వివాదంపై సృష్టించినందుకు మాజీ క్రికెటర్లు, అభిమానులు గంగూలీపై విరుచుకుపడ్డారు. “ఇది చాలా దురదృష్టకరం. సెలక్షన్ కమిటీ తరఫున గంగూలీ మాట్లాడే పని లేదు. గంగూలీ BCCI అధ్యక్షుడు. ఏదైనా సమస్య గురించి ఎంపిక లేదా కెప్టెన్సీ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ మాట్లాడాలి” ”అని వెంగ్‌సర్కార్ అన్నారు.
సెంచూరియన్‌లో చారిత్రాత్మక విజయంతో దక్షిణాఫ్రికా టూర్‌ను భారత్ ప్రారంభించినప్పటికీ కోహ్లీ వర్సెస్ గంగూలీ వివాదం వార్తల్లో నిలిచింది. T20 కెప్టెన్సీ నుంచి నిష్క్రమించే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించమని కోహ్లీని అభ్యర్థించామని కోహ్లీ చెప్పడం ద్వారా వివాదం మొదలైంది. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఒకే కెప్టెన్‌ని నియమించాలని బోర్డు నిర్ణయించిందని, అందుకే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సెలక్టర్ శర్మ స్పష్టం చేశారు. అప్పటి నుంచి భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. రెండు ODIలు ఓడిపోయింది.
బీసీసీఐ దక్షిణాఫ్రికా సిరీస్‌లోని చివరి టెస్టు వరకు టెస్ట్ కెప్టెన్ కోహ్లీని మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశాలకు హాజరుకాకుండా నిలిపివేసింది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో జరిగిన 2వ టెస్టు సందర్భంగా దీనిపై ద్రవిడ్ స్పందించాడు. ‘అలాంటిదేమీ లేదు. “కేప్‌టౌన్‌లో విరాట్‌కు 100వ టెస్టు జరగనున్నందున ప్రస్తుతం ప్రెస్‌కాన్ఫరెన్స్‌లకు దూరంగా ఉన్నారని నాకు చెప్పడాని వివరించాడు.
భారత్ 2-1తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. మైదానంలో తమ ఆరాధ్యదైవం దూకుడు, అత్యుత్సాహం కనిపించడం లేదని కోహ్లీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంకతో జరిగే ముఖ్యమైన సిరీస్‌లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చుట్టూ జరిగే ముఖ్యమైన సిరీస్‌లతో భారత క్రికెట్ చాలా చర్చనీయాంశమైన పరివర్తన దశపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో, గంగూలీ వర్సెస్ కోహ్లీ సాగా కోహ్లీ వివాదం ఆందోళన కలిగిస్తోంది.
T20 ప్రపంచ కప్‌కు ముందు, ఛాంపియన్‌షిప్ తర్వాత అతి తక్కువ ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. ODI,టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అతను టెస్ట్ కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. కోహ్లీ బహుశా ఇవి సాధారణ సమయాలు కాదని భావించి, మరింత అవమానానికి గురికాకుండా తన టెస్ట్ కెప్టెన్సీకి అకాల ముగింపు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
కొత్త ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలంలో ICC ట్రోఫీలను లక్ష్యంగా చేసుకున్న భారత క్రికెట్ కీలక దశలోకి ప్రవేశించింది. కోహ్లీ కెప్టెన్‌గా మారినప్పటికీ, ICC ట్రోఫీలను గెలుచుకోవాలనే కలను సాధించలేదు. భారత క్రికెట్‌ను గాడిలో పెట్ట బాధ్యత గంగూలీపై ఉంది. కాబట్టి అతను ఇప్పుడు మొదటి అడుగు వేసి, కోహ్లీతో బంధాన్ని కొనసాగించాలి.
Read Also.. IPL-2022 Mega Auction: మెగా వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాచైజీలు.. ఎవరి వద్ద ఎంత డబ్బు ఉందంటే..