Shoaib Akhtar: భారత క్రికెట్ క్రాస్ రోడ్డులో ఉంది.. రాహుల్ ద్రవిడ్​కు పెద్ద సవాలే ఇది..

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ శకం ముగిసిన తర్వాత భారత్ క్రాస్‌రోడ్‌లో ఉందని పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు...

Shoaib Akhtar: భారత క్రికెట్ క్రాస్ రోడ్డులో ఉంది.. రాహుల్ ద్రవిడ్​కు పెద్ద సవాలే ఇది..
Shoaib Akhtar
Follow us

|

Updated on: Jan 23, 2022 | 3:32 PM

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ శకం ముగిసిన తర్వాత భారత్ క్రాస్‌రోడ్‌లో ఉందని పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కోచ్‌గా తనను తాను నిరూపించడం రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద సవాలుగా మారిందని అభిప్రాయపడ్డాడు. ODI జట్టు కెప్టెన్సీ తొలగించిన తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 1-2 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా కెప్టెన్సీని విడిచిపెట్టాడు. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ T20 టోర్నమెంట్ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ“”సౌరవ్ గంగూలీ (BCCI అధ్యక్షుడు) ఇతరులు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. అయితే భారత క్రికెట్ క్రాస్‌రోడ్స్​లో ఉంది.” అని చెప్పాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ నేతృత్వంలోని భారత్ వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. రాహుల్ ద్రవిడ్ కోచ్​గా వచ్చిన మొదటి విదేశీ పర్యటనలో భారత్ విఫలమైంది. ” భారత క్రికెట్ పతనం కాదు. మీరు పరిస్థితిని నిర్వహించాలి. రాహుల్ ద్రవిడ్ ముందు పెను సవాలే ఉంది. అతను కోచ్‌గా రాణిస్తాడని ఆశిస్తున్నాను. అతని ముందు పెద్ద సవాలు ఉంది. అతను ఎలా రాణిస్తాడో చూద్దాం.” అని చెప్పాడు.

తొలి టెస్టులో గెలిచిన భారత్ తర్వాతి రెండు టెస్టుల్లో ఓడిపోయి సౌతాఫ్రికాలో మరోసారి సిరీస్ గెలవాలనే కలను ఛిన్నాభిన్నం చేసుకుంది. 2014లో మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో కోహ్లీ భారత టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్నాడు.

ఫాస్ట్ బౌలర్లు మారాలి

ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో ఇండియాకు కొన్ని చిరస్మరణీయ విజయాలను అందిచారు. ఫాస్ట్ బౌలర్లు తమ విధనం మార్చాల్సిన అవసరం ఉందని అక్తర్ అన్నారు.

Read Also.. Ganguly vs Kohli: భారత క్రికెట్​లో ఏం జరుగుతుంది.. ఆ వివాదానికి ముగింపు పలకాల్సిందేనా..