- Telugu News Photo Gallery Viral photos Haridwar also look at the beauty of these hill stations near it
Viral Photos: హరిద్వార్ పవిత్రమైన స్నానానికే కాదు.. ఈ ప్రదేశాలకు కూడా చాలా ఫేమస్..
Viral Photos: హరిద్వార్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గంగానదిలో స్నానమాచరించేందుకు ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విశేషమేమిటంటే హరిద్వార్‌లో భక్తులే కాదు
Updated on: Jan 22, 2022 | 9:40 PM

హరిద్వార్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గంగానదిలో స్నానమాచరించేందుకు ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విశేషమేమిటంటే హరిద్వార్‌లో భక్తులే కాదు అందమైన దృశ్యాలను తిలకించడానికి పర్యాటకులు కూడా వస్తారు. మీరు ఎప్పుడైనా హరిద్వార్‌కు వెళితే ఈ హిల్ స్టేషన్‌లను తప్పకుండా ఆస్వాదించండి.

ప్రతి ఒక్కరూ ముస్సోరీని సందర్శించడానికి ఇష్టపడతారు. ఇది హరిద్వార్ సమీపంలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. వింటర్ సీజన్‌లో ఇక్కడికి వెళితే మిమ్మల్ని మీరు మరిచిపోతారు.

ముస్సోరీ నగరానికి దాదాపు 38 కి.మీ దూరంలో కనాటల్ అనే చిన్న పట్టణం ఉంటుంది. ఇక్కడ పచ్చదనం అద్భుతంగా ఉంటుంది. దేవాలయాలను సందర్శించడం మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

మీరు హరిద్వార్‌కు వెళితే ఈసారి దాని పరిసరాల్లో ఉన్న నైనిటాల్ హిల్ స్టేషన్‌ను కూడా చూడండి. నైనిటాల్‌ను రిసార్ట్స్ నగరం అని కూడా పిలుస్తారు.

రాణిఖేత్ నగరం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక్కడ అందమైన పర్వతాలు, మైదానాలు, దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.



