టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ హఠాత్తుగా తప్పుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. విరాట్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. విరాట్ కోహ్లీ ఈ చర్యపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే రోహిత్ శర్మ గురించి కూడా ఈ మాజీ కోచ్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
1 / 5
ఆజ్ తక్‌తో ప్రత్యేక సంభాషణలో, రవిశాస్త్రి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ఇంకా 2 సంవత్సరాల పాటు టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించగలడని చెప్పాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్వదేశంలో ఎక్కువ కాలం క్రికెట్ ఆడుతుందని, ఇదే జరిగి ఉంటే విరాట్ కోహ్లీ తన విజయాలను మరింత పెంచుకునేవాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి రికార్డు అద్భుతం, అతను స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లను ఓడించాడు.
2 / 5
టెస్టు కెప్టెన్సీ రేసులో రోహిత్ శర్మ ముందంజలో ఉన్నాడు. ఫిట్‌గా ఉంటే, రోహిత్ ఖచ్చితంగా కెప్టెన్‌గా మారగలడని రవిశాస్త్రి తెలిపాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను వైస్ కెప్టెన్‌గా చేశారు. అయితే రోహిత్ ఎందుకు కెప్టెన్‌గా ఉండలేకపోతున్నాడు?
3 / 5
విరాట్ కోహ్లి, రవిశాస్త్రిల జంట విడిపోయిన తర్వాత, భారత జట్టులో చాలా మార్పు వచ్చింది. మొదట టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్.. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. చివరికి విరాట్ కోహ్లీ కూడా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
4 / 5
బీసీసీఐ, విరాట్ కోహ్లి మధ్య సఖ్యత లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ బ్యాట్స్‌మెన్‌పై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆగ్రహంతో ఉన్నారని, దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు తాను మాట్లాడిన విషయాలపై బీసీసీఐ చీఫ్ విరాట్‌కు కూడా నోటీసు ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ నివేదికలు నిరాధారమైనవని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.