AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెక్సికో అధ్యక్షురాలికి నడిరోడ్డుపై చేదు అనుభవం.. స్థానికులతో మాట్లాడుతుండగా షాకింగ్ ఘటన!

ఆమె సాదాసీదా మహిళకాదు..సాక్షాత్తూ దేశాధ్యక్షురాలు.. కానీ ఆమెకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. షాకింగ్ ఇన్సిడెంట్‌తో కంగుతిన్న దేశాధ్యక్షురాలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ప్రజలతో అధ్యక్షురాలు మాట్లాడుతుండగా..వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై చేయి వేస్తూ ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టారు.

మెక్సికో అధ్యక్షురాలికి నడిరోడ్డుపై చేదు అనుభవం.. స్థానికులతో మాట్లాడుతుండగా షాకింగ్ ఘటన!
Mexican President
Balaraju Goud
|

Updated on: Nov 06, 2025 | 6:57 AM

Share

మెక్సికోలో దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. సాక్షాత్తూ దేశాధ్యక్షురాలే నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం రేపుతోంది. మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ ఇటీవల ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలతో అధ్యక్షురాలు మాట్లాడుతుండగా..వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై చేయి వేస్తూ ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టారు.

అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడుతూ.. అతడి చేతిని పక్కకు నెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశాధ్యక్షురాలికే భద్రత లేకపోతే సాధారణ మహిళల పరిస్థితేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది భారీ భద్రతా వైఫల్యమని.. ఆ వ్యక్తి అంత దగ్గరకు వచ్చే వరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఘటన జరిగిన సమయంలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు స్థానిక అధికారులు.

మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రం ఉరుఆపాన్ పట్టణ మేయర్ కార్లోస్ మాంజో ఇటీవల హత్యకు గరయ్యారు. ఈ హత్యకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు రోడ్ల మీదకు వచ్చారు. ప్రజలకు రక్షణ కల్పించలేదని అసమర్థపు ప్రభుత్వం అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను శాంతింపజేసి, రక్షణ చర్యలు చేపట్టేందుకు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ మిచోకాన్‌ రాష్ట్రంలో పర్యటించారు. మెక్సికో సిటీ కేంద్రంలో ప్రజలతో అధ్యక్షురాలు కరచాలనం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఊహించని పరిణామాన్ని అధ్యక్షురాలు కూల్‌గా హ్యాండిల్‌ చేశారు. అతన్ని పక్కకి తోసేస్తూ డోండ్‌ వర్రీ అంటూ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అలెర్ట్‌ చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుణ్ని వెనక్కి లాగారు.

వీడియో చూడండి.. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..