AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneezing Risks : ఓరీ దేవుడో..తుమ్మును ఆపుకుంటే ఎంత డేంజరో తెలుసా…?

మనం రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాలను తేలికగా తీసుకుంటాము. అందులో ఒకటి తుమ్ము.. కొన్ని కొన్ని సందర్బాల్లో మనం తుమ్మును ఆపుకుంటుంటాం. తుమ్మాలని అనిపిస్తే చుట్టూ జనాలు ఉంటే ముక్కు మూసుకోవడం, ముక్కునోరు కలిపి మూసుకోవడం ద్వారా తుమ్మును ఆపేసుకుంటాము. కానీ, ఇది ఎంత పెద్ద ప్రమాదమో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. ఇటీవల ఒక వ్యక్తి తుమ్మకుండా ఆపుకోవడం వల్ల అతడు ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Sneezing Risks : ఓరీ దేవుడో..తుమ్మును ఆపుకుంటే ఎంత డేంజరో తెలుసా…?
Dangers Of Suppressing Sneezes
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2025 | 9:36 PM

Share

చాలాసార్లు మనం తుమ్ములను అణచుకుంటాం. దీంతో ఏమౌతుందిలే అనుకుంటాం..కానీ, ఒక్క తుమ్మును ఆపుకోవడం కూడా ప్రాణాంతకమని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. తుమ్మును ఆపుకోవటం వల్ల యూకేకి చెందిన 30 వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతను తుమ్మును ఆపుకోవడం వల్ల గొంతులో రంధ్రం పడింది. అతని ఊపిరితిత్తులు గాలితో నిండిపోయాయి. ఈ వార్త ప్రపంచంలో ఇదే మొదటి కేసు. ఈ భయంకరమైన సంఘటన పూర్తి వివరాలను, సైన్స్, వైద్యులు అందించే హెచ్చరికలను తెలుసుకుందాం.

ఈ సంఘటన 2023లో UKకి చెందిన 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి జరిగింది. అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలెర్జీల కారణంగా తుమ్ములు మొదలయ్యాయి. కానీ, అందరిలో ఉన్నప్పుడు అతను సిగ్గు, భయంతో అతను తన ముక్కును, నోటిని మూసుకున్నాడు. దాంతో అతడు తుమ్మును ఆపేశాడు. కానీ, ఆ వెంటనే అతని గొంతులో తీవ్రమైన నొప్పి అనిపించింది. లోపల ఏదో పగిలిపోయినట్లు అనిపించింది. అతని శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. అతని మెడ ఉబ్బింది. వెంటనే అతను ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ని సంప్రదించాడు. CT స్కాన్‌లో అతని శ్వాసనాళంలో (విండ్‌పైప్) 2×2 mm రంధ్రం కనిపించింది. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య గాలి పేరుకుపోయింది. ఇది ప్రాణాంతకం కావచ్చునని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసులో ప్రధాన డాక్టర్ రాస్కార్డ్స్ మిసిరోవ్స్ మాట్లాడుతూ..ఇది ఆశ్చర్యంగా ఉంది. మేము ఇంతకు ముందు ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదని చెప్పారు. తుమ్మును ఆపడం వల్ల ఎగువ శ్వాసనాళంలో ఒత్తిడి సాధారణం కంటే 5 నుండి 24 రెట్లు పెరుగుతుందని వైద్యులు వివరించారు. ఈ ఒత్తిడి శ్వాసనాళాన్ని చీల్చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంలో ఒత్తిడి 20 రెట్లు పెరిగి, ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది. అది పెద్దగా ఉంటే, ఇన్ఫెక్షన్, రక్తస్రావం లేదా ఊపిరాడక మరణానికి కారణం కావచ్చు అన్నారు. రోగికి నొప్పి నివారణ మందులు ఇచ్చి 48 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. అదృష్టవశాత్తూ ఆ రంధ్రం 5 వారాలలో దానంతట అదే నయమైంది. కానీ, ముక్కు, నోరు మూయడం ద్వారా తుమ్మును ఆపుకోవద్దని వైద్యులు హెచ్చరించారు. ఇది శ్వాసనాళలు పగిలిపోయేందుకు కారణమవుతుందని చెప్పారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..