Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్ష బీభత్సం..! రూ. 4 కోట్ల కారు పడవగా మారింది.. దుబాయ్‌లో వర్షాన్ని ఆనందిస్తున్న వ్యాపారి.. వీడియో వైరల్

దుబాయ్‌లో రెండేళ్లలో నమోదయ్యే వర్షపాతం.. ఒక్కరోజులోనే కొన్ని గంటల్లోనే నమోదైంది. వర్షాలు, వరదలతో భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. దుబాయ్‌ జల విలయానికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి ఒక వీడియోలో ఎరుపు రంగు రోల్స్ రాయిస్

వర్ష బీభత్సం..! రూ. 4 కోట్ల కారు పడవగా మారింది.. దుబాయ్‌లో వర్షాన్ని ఆనందిస్తున్న వ్యాపారి.. వీడియో వైరల్
Man Enjoying On Rolls Royce
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 21, 2024 | 11:01 AM

దుబాయ్‌ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ఇక్కడి ఎడారి దేశంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోతతో వర్షాలు కుమ్మరించాయి. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. దుబాయ్‌లో రెండేళ్లలో నమోదయ్యే వర్షపాతం.. ఒక్కరోజులోనే కొన్ని గంటల్లోనే నమోదైంది. వర్షాలు, వరదలతో భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. దుబాయ్‌ జల విలయానికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి ఒక వీడియోలో ఎరుపు రంగు రోల్స్ రాయిస్ బానెట్‌పై ఓ వ్యక్తి కూర్చుని ఉండటం, అతని చుట్టూ నీరు చేరిపోయి కనిపించింది. ఆ వ్యక్తి హాయిగా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తూ ఆహ్వానిస్తున్నాడు. పైగా అతడు చేతిలో ఎనర్జీ డ్రింక్ కూడా పట్టుకుని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే.. వరదలో ఆగిపోవటంతో అతడు బ్యానెట్‌పై ఎక్కిన ఆ కారు విలువ సుమారు 4 కోట్ల పైమాటే. ఇలా కోట్ల విలువైన కారు ఇప్పుడు అక్కడ పడవగా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఏప్రిల్ 15, 16 తేదీలలో యుఎఇలో చాలా వర్షాలు కురిశాయి. ఎటూ చూసిన వరద ప్రవహమే కనిపించింది.

వైరల్‌ వీడియోలో ఎరుపు రంగు రోల్స్ రాయిస్ బానెట్‌పై ఓ వ్యక్తి కూర్చుని ఉండగా, చుట్టూ నీరు నిలిచిపోయింది. అతడు చేతిలో ఎనర్జీ డ్రింక్ పట్టుకుని ఎంజాయ్‌ చేస్తున్నాడు. వీడియోలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. వీడియోలో ఉన్న వ్యక్తి 29 ఏళ్ల వియత్నామీస్ ఫారెక్స్ వ్యాపారి @mrpips217 తన సరికొత్త రోల్స్ రాయిస్ దుబాయ్‌లో వర్షంలో చిక్కుకున్నప్పుడు తన సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు”అంటూ వీడియోతో పాటు క్యాప్షన్‌లో రాసి ఉంది. దీనితో పాటు, చాలా మంది వినియోగదారులు వీడియోపై తమ స్పందనను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన తర్వాత యూజర్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఇప్పుడు ఎడారి దేశంలో నీటి కొరత తీరిపోయిందని అంటున్నారు. మరొక వినియోగదారు దీన్ని ఎంత అద్భుతమైన దృశ్యం అంటూ వ్యాఖ్యానించారు. బడా వ్యాపారవేత్తలు మాత్రమే ఇలాంటివి చేయగలరు అని మరొక వినియోగదారు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..