Dubai Floods: దుబాయ్ వరదల్లో భారతీయ పారిశ్రామిక వేత్త..! ఎలా ఉన్నారో చూస్తే అవాక్కే.. వైరలవుతున్న వీడియో..
వరద విలయంతో అతలాకుతలంగా మారిన ఎడారి దేశం యుఎఇని చూసి అందరూ షాక్ అయ్యారు. దుబాయ్ వరదలకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. దుబాయ్ పరిస్థితిని చూసి జాలి కలిగినప్పటికీ ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వు ఆపుకోవటం కష్టంగా మారింది అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ వీడియోలో ఏముందంటే...
ఇటీవల దుబాయ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు కొత్త చర్చకు తెర లేపాయి. చాలా అరుదుగా వర్షాలు కురిసే దేశాల్లో యూఏఈ ప్రధానంగా ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఏప్రిల్ 16న అక్కడ కురిసిన వర్షం ప్రజల ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. వరదలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. వరద విలయంతో అతలాకుతలంగా మారిన ఎడారి దేశం యుఎఇని చూసి అందరూ షాక్ అయ్యారు. దుబాయ్ వరదలకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. దుబాయ్ పరిస్థితిని చూసి జాలి కలిగినప్పటికీ ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వు ఆపుకోవటం కష్టంగా మారింది అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ వీడియోలో ఏముందంటే…
వైరల్ వీడియో పారిశ్రామికవేత్త ఆకాష్ మెహతా, ఇందులో దుబాయ్‌లో ఆకస్మిక వరదల సమయంలో అతను తన బాల్కనీలో నీటిని తోడిపోస్తూ శుభ్రం చేస్తున్నాడు. అయితే, జూమ్ మీటింగ్స్ లో పాల్గొంటూనే ఇదంతా చేశాడన్నది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఫన్నీగా స్పందించారు.
వీడియోలో, ఆకాష్ తన ఆఫీస్ సహోద్యోగులతో జూమ్ మీటింగ్‌లో ఉన్నాడు. అయితే UAE లో భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతం మొత్తం ఇలా నీటితో నిండిపోయింది. అటువంటి పరిస్థితిలో తన బాల్కనీలోకి కూడా భారీగా వర్షాపు నీరు చేరడంతో అతడు..లైవ్ మీటింగ్‌లో ఉండగానే.. అక్కడ చేరిన నీటిని ఎత్తిపోస్తున్నాడు. ఆ మధ్యలో అతడు వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. అదంతా చాలా ఫన్నీగా కనిపించింది.
View this post on Instagram
ఈ క్లిప్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు దీన్నిపై ఆనందంగా స్పందించారు. నెటిజన్లు తమాషా వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ‘సర్, క్లీన్ సిట్టింగ్ బాగుంది.. కానీ మీ డ్యాన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉందని రాశారు. మరొక వినియోగదారు, ‘సార్, మిమ్మల్ని ఇక్కడ చూసినందుకు ఆనందంగా ఉంది’ అని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..