Viral Video: కర్మఫలం అంటే ఇదేనేమో.! గాడిదతో ఎకసెక్కాలు.. దెబ్బకు తిక్కకుదిర్చిందిగా..
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెంట్‌లో ఒకవైపు ఫన్నీ వీడియోస్ ఉంటే.. మరోవైపు షాకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఆ షాకింగ్ వీడియోలలో కొందరు జంతువులను హింసిస్తూ.. రాక్షసానందం పొందుతుంటారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెంట్‌లో ఒకవైపు ఫన్నీ వీడియోస్ ఉంటే.. మరోవైపు షాకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఆ షాకింగ్ వీడియోలలో కొందరు జంతువులను హింసిస్తూ.. రాక్షసానందం పొందుతుంటారు. అయితే టైం ఒకేలా ఉండదు కదా.! కర్మ ఈజ్ బూమరాంగ్.. కచ్చితంగా వాళ్లంతా గుణపాఠం నేర్చుకుంటారు. ఈ తరహాలోనే తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి గాడిదతో ఎకసెక్కాలు చేస్తే.. చివరికి ఏమైందో తెలిస్తే..!
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి గాడిద తోక పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆ గాడిద అతడ్ని మొదటిగా వెనుక కాలితో తన్నాలని చూస్తుంది. కానీ ఆ దాడి నుంచి తప్పించుకుంటాడు ఆ ఆకతాయి. అయితేనేం సదరు వ్యక్తి పదేపదే గాడిద తోకతో ఆడుకునేందుకు ప్రయత్నించగా.. ఆవేశంతో గాడిద వెనక్కి తిరిగి.. అతడిని తరుముకుంటూ వెళ్తుంది. దాని దాడి నుంచి తప్పించేందుకు సదరు వ్యక్తి ప్రయత్నించినప్పటికీ.. అతడికి ఎలాగైనా బుద్ది చెప్పాలన్న ఉద్దేశంతో గాడిద దూరం వరకు తరుముకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అతడు చేసిన పనికి మండిపడుతున్నారు.
— Out of Context Human Race (@NoContextHumans) April 18, 2024