USA: అమెరికాలో భారత టెకీ మృతి.. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి అదృశ్యం! నదిలో కొట్టుకువచ్చిన అవశేషాలు

అమెరికాలోని శాన్ జోస్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సిద్ధాంత్‌ విఠల్‌ పాటిల్‌ (25) జూలై 6న స్నేహితులతో కలిసి అవలాంచె లేక్ ట్రైల్‌పై హైకింగ్‌కు వెళ్లాడు. అయితే హైకింగ్‌ సమయంలో ఓ పెద్ద రాయిపై నుంచి పక్కనే ఉన్న నదిలోకి పడిపోయాడు. అయితే, అతను రాయిపై పాచి వల్ల జారిపోయాడా లేదా బ్యాలెన్స్ కోల్పోయాడా అనేది స్పష్టంగా తెలియరాలేదు. నీటిలో పడిపోయిన పాటిల్‌.. అడుగుకు వెళ్లి తిరిగి పైకి రావడం అతని స్నేహితులు చూశారు..

USA: అమెరికాలో భారత టెకీ మృతి.. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి అదృశ్యం! నదిలో కొట్టుకువచ్చిన అవశేషాలు
Siddhant Vithal Patil
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 13, 2024 | 12:05 PM

వాషింగ్టన్‌, జూలై 12: అమెరికాలో మరో భారతీయ యువకుడు మృతి చెందాడు. కాలిఫోర్నియాలోని గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఇండియన్‌ టెకీ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన జులై 5న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాటర్‌ ఫాల్‌లో పడిపోవడంతో అతని డెట్‌ బాడీ కూడా లభ్యం కాలేదు. అసలేం జరిగిందంటే..

అమెరికాలోని శాన్ జోస్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సిద్ధాంత్‌ విఠల్‌ పాటిల్‌ (25) జూలై 6న స్నేహితులతో కలిసి అవలాంచె లేక్ ట్రైల్‌పై హైకింగ్‌కు వెళ్లాడు. అయితే హైకింగ్‌ సమయంలో ఓ పెద్ద రాయిపై నుంచి పక్కనే ఉన్న నదిలోకి పడిపోయాడు. అయితే, అతను రాయిపై పాచి వల్ల జారిపోయాడా లేదా బ్యాలెన్స్ కోల్పోయాడా అనేది స్పష్టంగా తెలియరాలేదు. నీటిలో పడిపోయిన పాటిల్‌.. అడుగుకు వెళ్లి తిరిగి పైకి రావడం అతని స్నేహితులు చూశారు. అనంతరం అతడు నీటిలో కొట్టుపోయినా స్నేహితులు కాపాడలేకపోయారు. అతడి మృతదేహం ఇంతవరకు లభ్యంకాలేదు. పాటిల్‌ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. పాటిల్‌ మృతి చెందిన విషయాన్ని స్నేహితులు అతని తల్లిదండ్రులకు తెలియజేయగా.. వారు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వశాఖ.. అతని మృతదేహాన్ని కనుగొనవలసిందిగా అమెరికా అధికారులకు విజ్ఞప్తి చేసింది.

విషాదం జరగడానికి కొన్ని గంటల ముందు, పాటిల్ తన తల్లికి ఫోన్‌ చేసి మెసేజ్‌ కూడా పంపాడని అతని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. గత శుక్రవారం పాటిల్‌ సిద్ధాంత్ తన తల్లి ప్రీతికి పార్క్ నుంచి ఫోన్‌ చేసి, తాను మరో ఆరుగురు ఇండియన్‌ స్నేహితులతో కలిసి మూడు రోజులుగా పార్కులో ఉన్నానని, ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నానని ఆమెకు తెలిపినట్లు మృతుడి మేనమామ ప్రితేష్ చౌదరి మీడయాకు తెలిపారు. తర్వాత టెక్స్ట్ మెసేజ్‌ కూడా చేశాడు. మరో మూడు రోజుల్లో తిరిగి ఇంటికి వస్తానని తల్లికి తెలిపాడు. ఇంతలో ఈ దారుణం చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమవారం నుంచి కాన్సులేట్‌తో టచ్‌లో ఉన్నానని, అయితే పాటిల్‌ మృతదేహానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందించలేదని ప్రతేష్‌ తెలిపాడు. కాగా పాటిల్ తండ్రి గత మే నెలలో మహారాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ నుంచి పదవీ విరమణ పొందారు. అతని మృతదేహం కోసం అధికారులు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు. ఎంత వెతికినా పాటిల్ మృతదేహం లభ్యంకాలేదని, అతడు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నామని గ్లేసియర్ నేషనల్ పార్క్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే నీటిలో దిగువకు కొట్టుకువచ్చిన అతని వస్తువులు కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. రాళ్లు, చెట్ల మధ్య అతని మృతదేహం ఇరుక్కుని ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.