Viral video: పోలీస్‌ స్టేషన్‌పైకి ఎక్కి ఎద్దు పహారా..! భయంతో హడలెత్తిపోయిన ఖాకీలు.. వీడియో

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు అనుకోని అతిథిగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. దీనిలో విచిత్రం ఏముందని అనుకుంటున్నారా? అది పోలీస్‌ స్టేషన్‌లోపలికి కాకుండా ఏకంగా స్టేషన్‌ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది. గంటల తరబడి అక్కడే ఉండి.. ఆనక తీరిగ్గా కిందికి వచ్చింది. దీంతో ఎద్దు తమ మీద ఎక్కడ పడుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలోని..

Viral video: పోలీస్‌ స్టేషన్‌పైకి ఎక్కి ఎద్దు పహారా..! భయంతో హడలెత్తిపోయిన ఖాకీలు.. వీడియో
Bull Climbs On A Police Station
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 12, 2024 | 10:31 AM

లక్నో, జులై 12: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు అనుకోని అతిథిగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. దీనిలో విచిత్రం ఏముందని అనుకుంటున్నారా? అది పోలీస్‌ స్టేషన్‌లోపలికి కాకుండా ఏకంగా స్టేషన్‌ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది. గంటల తరబడి అక్కడే ఉండి.. ఆనక తీరిగ్గా కిందికి వచ్చింది. దీంతో ఎద్దు తమ మీద ఎక్కడ పడుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలోని సలోన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాయ్‌బరేలిలోని సలోన్‌లోని పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న సుచిలోని పోలీస్ అవుట్‌పోస్ట్ పైకప్పు పైకి ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో తెలియదు గానీ ఓ ఎద్దు వచ్చింది. అయితే ఈ విషయం స్టేషన్‌లోని పోలీసులెవ్వరికీ తెలియదు. వారంతా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ విచిత్ర ఘటనను చూసిన స్టేషన్‌లోని పోలీసులు సహా స్థానికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న ఊరి జనమంతా ఈ విచిత్ర ఘటనను చూసేందుకు స్టేషన్‌ వద్దకు పరుగున వచ్చారు. అయితే ఆ ఎద్దు పైకప్పుపైకి ఎలా వెళ్లిందన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో దానిని కిందికి ఎలా దించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆ ఎద్దును కిందకు తరిమే పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే అది ఎక్కడ భయపడి ఔట్‌పోస్టు పైకప్పు నుండి కిందికి దూకేస్తుందోనని ఒకటే హడలెత్తిపోయారు. చివరికి ఎలాగోనా ఎద్దును కిందికి పంపేందుకు పోలీసులు లాఠీలతో దానికి సమీపంగా వెళ్లగా.. అనుకున్నట్లే అది భయపడి పక్కనే ఉన్న గ్రామ ప్రధాన్ జముర్వా బుజుర్గ్ ఇంటి డాబాపై నుంచి కింద అమాంతం పడిపోయింది. అంత ఎత్తునుంచి కిందపడటంతో ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లోకి ఓ ఎద్దు ప్రవేశించి నానాహంగామా చేసింది. బ్యాంకు లోపల ఎద్దు కనిపించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వెంటనే సెక్యూరిటీ గార్డు దానిని తరిమి కొట్టాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.