Hero Rat: 100కు పైగా ల్యాండ్‌మైన్స్ గుర్తించి.. ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ‘మగావా’ ఇకలేదు

ఇది మాములుగా ఇళ్ల మధ్య ఆహారం కోసం తిరిగే మూషికం కాదు. ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన మూషికం. తన సేవలకుగానూ ఏకంగా గోల్డ్‌ మెడల్ అందుకుంది.

Hero Rat: 100కు పైగా ల్యాండ్‌మైన్స్ గుర్తించి.. ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ‘మగావా’ ఇకలేదు
Hero Rat
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2022 | 8:58 AM

rat Magawa: ఇది మాములుగా ఇళ్ల మధ్య ఆహారం కోసం తిరిగే మూషికం కాదు. ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన మూషికం. తన సేవలకుగానూ ఏకంగా గోల్డ్‌ మెడల్ అందుకుంది. కాంబోడియాలో వందకు పైగా ల్యాండ్‌మైన్స్ గుర్తించి, ప్రశంసలు అందుకుంది. ఆఫ్రికన్‌ సంతతికి చెందిన ఈ పెద్ద ఎలుక పేరు ‘మగావా’. కాగా గత వారాంతంలో ఈ ఎలుక మృతి చెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి. బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘అపొపో’ ఈ విషయాన్ని వెబ్‌సైటు ద్వారా వెల్లడించింది. ‘మగావా’ మృతికి ‘అపొపో’ ఘన నివాళి అర్పించింది. ల్యాండ్ మైన్స్ సహా ఇతర పేలుడు పదార్థాలను వాసన ద్వారా కనుగొనేలా ఎలుకలు, కుక్కలకు ‘అపొపో’ ట్రైనింగ్ ఇస్తుంటుంది. కాగా మందుపాతరల వెలికితీతలో ఈ ఆఫ్రికన్‌ ఎలుకలు చాలా యాక్టివ్ అని పేరు తెచ్చుకున్నాయి. మందుపాతరల గుర్తించే దశలో పేలుడుకు ఛాన్స్ ఇవ్వకుండా, చాలా అప్రమత్తంగా వాటిని గుర్తిస్తాయి.

కాంబోడియాలో మూడు దశాబ్దాలపాటు సాగిన అంతర్యుద్ధం 1998లో ముగిసింది.  అయితే తిరుగుబాటు సమయంలో అమర్చిన ల్యాండ్ మైన్స్, ఇతర బాంబులు.. ఇప్పటికీ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.  ఈ క్రమంలో 2013లో టాంజానియాలో పుట్టిన ఎలుక ‘మగావా’ను..  ట్రైనింగ్ అనంతరం 2016లో కాంబోడియాకు పంపారు. అక్కడ 5 సంవత్సరాల పాటు సేవలను అందించిన మగావా వందకు పైగా మందుపాతరలను, బాంబులను వెలికితీయడంలో కీ రోల్ పోషించింది. గతేడాదే ఈ మూషికానికి ‘రిటైర్మెంట్‌’ ఇచ్చారు.  తన సేవలతో కాంబోడియాలో ఎంతోమంది ప్రాణాలను నిలపినందుకు గుర్తింపుగా 2020లో బ్రిటన్‌కు చెందిన ‘పీపుల్స్‌ డిస్పెన్సరీ ఫర్‌ సిక్‌ అనిమల్స్‌’ అనే వెటర్నరీ ఛారిటీ సంస్థ నుంచి మగావా గోల్డ్ మెడల్ అందుకొంది. జంతువుల విభాగంలో శౌర్య పరాక్రమాలకు ఇచ్చే అత్యున్నత అవార్డుగా దీన్ని భావిస్తారు. ‘రిటైర్మెంట్‌’ అనంతరం.. కాంబోడియాలోని వాయవ్య ప్రావిన్సు సీయమ్‌ రీప్‌ చేరుకొన్న మగావా.. తాజాగా ప్రాణాలు విడిచింది.

Also Read: పెళ్లి కావడం లేదన్న మనస్తాపం.. అమ్మ ఉంటే ఇలా అయ్యేది కాదంటూ యువకుడు సూసైడ్

నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..