Passport Ranking 2022: జపాన్..సింగపూర్ పాస్‌పోర్ట్స్ సూపర్.. మరి మన దేశ పాస్‌పోర్ట్ పరిస్థితి ఏమిటంటే..
పాస్‌పోర్ట్ ర్యాంకింగ్(Passport Ranking)లను జారీ చేసే సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ 2022కి సంబంధించిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్(Passport Index)ను విడుదల చేసింది. జపాన్, సింగపూర్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి.
పాస్‌పోర్ట్ ర్యాంకింగ్(Passport Ranking)లను జారీ చేసే సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ 2022కి సంబంధించిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్(Passport Index)ను విడుదల చేసింది. జపాన్, సింగపూర్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి. ఈ దేశాల పౌరులు ముందస్తు వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. చాలా దేశాలు ఒకే ర్యాంక్‌ను కలిగి ఉన్నాయి. దీనికి కారణం ఈ దేశాల పౌరులు సమాన దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. భారత్(India) ర్యాంకింగ్ 7 స్థానాలు మెరుగుపడింది. పోయిన సంవత్సరంలో అంటే 2021లో మన పాస్‌పోర్ట్ 90వ స్థానంలో ఉంది. ఈసారి 83వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ ర్యాంకింగ్ 108వ స్థానంలో ఉంది.
ర్యాంకింగ్ ఎలా నిర్ణయిస్తారంటే..
ఈ ర్యాంకింగ్ ప్రతి సంవత్సరం ప్రారంభంలో విడుదల చేస్తారు. హెన్లీ పాస్‌పోర్ట్ వీసా ఇండెక్స్ వెబ్‌సైట్ ప్రకారం – రియల్ టైమ్ డేటా ఏడాది పొడవునా నవీకరణ జరుగుతుంది. వీసా విధానంలో మార్పులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ డేటా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA)నుంచి తీసుకోవడం జరిగింది. ఒక దేశానికి చెందిన పాస్‌పోర్ట్ హోల్డర్ ముందస్తు వీసా పొందకుండా ఎన్ని ఇతర దేశాలకు వెళ్లవచ్చనే దాని ఆధారంగా ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. దీని కోసం ప్రయాణీకులు ముందస్తుగా వీసా పొందవలసిన అవసరం లేదు.
భారత పౌరులు ముందస్తు వీసా లేకుండా 60 దేశాలకు ప్రయాణించవచ్చు. గతేడాది ఈ సంఖ్య 58గా ఉంది. ఈ సంవత్సరం, ఒమన్ .. అర్మేనియా భారతీయులకు ముందస్తు వీసాలు లేకుండా ప్రయాణించడానికి అనుమతించాయి.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా విమాన ప్రయాణీకులపై అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణీకులపై పలు నిబంధనలు విధించాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు.. కరోనా టెస్ట్ లు తప్పనిసరి చేశాయి. అంతేకాకుండా కొన్ని దేశాల్లో విమాన ప్రయాణం చేసి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులకు 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశాయి. ఈ నిబంధన పట్ల విమాన ప్రయాణీకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇవి కూడా చదవండి: UP Elections 2022: బీజేపీలో కొలిక్కివస్తున్న అభ్యర్థుల ఎంపిక.. సీఎం యోగి ఎక్కడి నుంచంటే..?
UP Elections: యూపీలో పెరుగుతున్న జంపింగ్ జపాంగ్‌లు.. బీజేపీకి మరో మంత్రి రాంరాం!