Telangana:పెళ్లి కావడం లేదన్న మనస్తాపం.. అమ్మ ఉంటే ఇలా అయ్యేది కాదంటూ యువకుడు సూసైడ్

తోటీ వాళ్లు అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. అతడికి మాత్రం అవ్వడం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండటం లేదు. దీంతో బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Telangana:పెళ్లి కావడం లేదన్న మనస్తాపం.. అమ్మ ఉంటే ఇలా అయ్యేది కాదంటూ యువకుడు సూసైడ్
Young Man Suicide
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 13, 2022 | 8:08 AM

తోటీ వాళ్లు అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. అతడికి మాత్రం అవ్వడం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండటం లేదు. దీంతో బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగం రాజేష్‌ (28) హనుమకొండలోని ఓ సీడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తల్లి తొమ్మిదేళ్ల కిందట కాలం చేశారు. ఇటీవల కుటుంబసభ్యులు రాజేష్‌ కు పెళ్లి సంబంధాలు చూడగా ఏవీ సెట్ కాలేదు. దీంతో అతడి మనసులో బాధ అలముకుంది. అమ్మే ఉంటే ఇలా జరిగేది కాదంటూ బాధపడుతూ మంగళవారం రాత్రి ఇంటిపైకి ఎక్కి పురుగుల మందు తాగి సొమ్మసిల్లి పడిపోయాడు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు రాజేష్‌ను వెతుకుతుండగా ఇంటిపై అపస్మారక స్థితిలో కనిపించడంతో షాక్ తిన్నారు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?