Israel-Palestine conflict: పదేళ్ల క్రితమే దాడులు చేసేందుకు ప్రణాళికలు.. చివరికి

ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌’ పేరుమీద ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మెరుపు దాడి చేయడంతో ఇజ్రాయెల్-పాలస్తీన్‌ల మధ్య భీకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ దాడి చేసేందుకు దాదాపు పదేళ్లకు ముందు నుంచే నిశ్శబ్దంగా ఏర్పాట్లు జరిగిపోయినట్లు తెలుస్తోంది 2014లో దీనిపై హెచ్చరికలు వచ్చినా కూడా ఇజ్రాయెల్‌ దీనిపై పెడచెవిన పెట్టిన ఫలితాన్ని తాజాగా చూస్తోంది.

Israel-Palestine conflict: పదేళ్ల క్రితమే దాడులు చేసేందుకు ప్రణాళికలు.. చివరికి
Israel Palestine Conflict
Follow us

|

Updated on: Oct 08, 2023 | 5:06 PM

ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌’ పేరుమీద ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మెరుపు దాడి చేయడంతో ఇజ్రాయెల్-పాలస్తీన్‌ల మధ్య భీకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ దాడి చేసేందుకు దాదాపు పదేళ్లకు ముందు నుంచే నిశ్శబ్దంగా ఏర్పాట్లు జరిగిపోయినట్లు తెలుస్తోంది 2014లో దీనిపై హెచ్చరికలు వచ్చినా కూడా ఇజ్రాయెల్‌ దీనిపై పెడచెవిన పెట్టిన ఫలితాన్ని తాజాగా చూస్తోంది. అయితే హమాస్‌ విదేశాలకు మిలిటెంట్లను పంపించి వారికి అక్కడ శిక్షణను ఇప్పించింది. అలాగే వీటితో పాటు మానవ వనరులు అవసరం ఉన్న దేశాలకు కూడా పాలస్తీనా మిలిటెంట్లు వెళ్లి అక్కడి నుంచి సాంకేతికతను పట్టుకొని వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధారణంగా సాయుధ మిలిటెంట్‌ గ్రూపుల వద్ద ఆయుధాలు, వనరులు పరిమితంగానే ఉంటాయి. దీనివల్ల ప్రత్యర్థిని షాక్‌కు గురిచేసే విధంగా దాడులు నిర్వహిస్తాయి.

అంతేకాదు.. ఇందుకోసం వారు ప్రతిదాడిలో ప్రత్యర్థి ఊహించని ఓ కోణం ఉండేటట్లు కూడా చూస్తారు. అయితే తాజాగా ‘ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌’లో ఇలాంటి కోణాలు ఉండేటట్లు హమాస్‌ పక్కాగా ప్రణాళికలు చేసింది. ముఖ్యంగా హమాస్‌ మిలిటెంట్లు మోటారైజ్డ్‌ పారా గ్లైడర్లు వినియోగిస్తుందని ఇజ్రాయెల్‌ బలగాలు అస్సలు ఊహించలేదు. గాలిలో నుంచి దూసుకొచ్చిన వారు ఇజ్రాయెల్ సరిహద్దు కంచెలు దాటి మరి అక్కడి పట్టణాల్లో నేలపై దిగుతున్న సమయంలోనే భయంతో పారిపోతున్న ప్రజలపై కాల్పులు జరిపారు. అయితే వీరిలో చాలా మంది ఆత్మాహుతి బృందానికి చెందిన వారున్నారని అంచనావేస్తున్నారు. వీరు శిక్షణ పొందుతున్న వీడియోను దాడలు చేసిన తర్వాత హమాస్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అయితే వీళ్లు పట్టణాల్లో దిగి ముందుగా దొరికిన పౌరులు, సైనికులను బందీలుగా పట్టుకొన్నారు. ఇలా చొచ్చుకొచ్చిన మోటారైజ్డ్‌ పారా గ్లైడర్లు వందల సంఖ్యలోనే ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే పారా గ్లైడర్లతో దాడిచేసి ఇజ్రాయెల్‌ పౌరులను అపహరించడానికి హమాస్‌ కుట్ర పన్నుతోందని దాదాపు పదేళ్ల క్రితమే నిఘావర్గాలకు సమాచారాలు అందాయి. ఇందుకు సంబంధించి 2014లోనే ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అధికారిక వెబ్‌సైట్‌ అయిన ఐడీఎఫ్‌.ఐఎల్‌లో ఓ కథనాన్ని ప్రచురితం చేశారు. దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ అనే ప్రదేశంలో ఓ హమాస్‌ కమాండర్‌ను ఇజ్రాయెల్‌ బలగాలు అదుపులోకి తీసుకొని విచారణ చేశాయి. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన పలు విషయాలను రాబట్టాయి. అయితే అతడ్ని అప్పటికే హమాస్‌.. మలేసియాకు పంపించి పారాగ్లైడింగ్‌లో శిక్షణ ఇప్పించినట్లు పేర్కొన్నారు. పారాచూట్ల సహాయంతో ఇజ్రాయెల్‌లోకి దిగి.. అక్కడి ప్రజలు, సైనికులను కిడ్నాప్‌ చేయడానికి రచించిన పథకంలో భాగంగా అతడితో సహా ఇంకో 10 మందిని 2010లోనే మలేసియాకు పంపించి అక్కడ శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత అతనికి ప్రతి ఐదు నెలలకు ఆయుధశిక్షణ ఇచ్చినట్టు కూడా గుర్తించారు ఇజ్రాయెల్ బలగారు. అనంతరం హమాస్ మిలిటెంట్లు గాజాపట్టీలోనే పారా గ్లైడింగ్‌ శిక్షణ ఏర్పాటు చేశారు. కానీ, ఆ తర్వాత హమాస్‌ దాడులకు పారాగ్లైడర్లను వినియోగించకపోవడంతో ఇజ్రాయెల్‌ దళాలు దీన్ని తేలిగ్గా తీసుకొన్నాయి. కానీ, ఇప్పుడు ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌లో పారాగ్లైడర్లు బయటకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..