AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో పరిస్థితి దారుణం, సాయం చేయండి.. క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ అభ్యర్థన

సెకండ్ వేవ్ కోవిడ్ కారణంగా ఇండియాలో పరిస్థితి దారుణంగా ఉందని క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ పేర్కొంది. ఈ విపత్కర సమయంలో ఇండియాకు సాయపడాలని ఆమె పప్రపంచ దేశాలను కోరింది.

ఇండియాలో పరిస్థితి దారుణం, సాయం చేయండి.. క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ అభ్యర్థన
Greta Thunberg Seeks Global Response To Oxygen Shortage
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 25, 2021 | 8:51 AM

Share

సెకండ్ వేవ్ కోవిడ్ కారణంగా ఇండియాలో పరిస్థితి దారుణంగా ఉందని క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ పేర్కొంది. ఈ విపత్కర సమయంలో ఇండియాకు సాయపడాలని ఆమె పప్రపంచ దేశాలను కోరింది. దేశంలో ఆక్సిజన్, హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత తీవ్రంగా ఏర్పడిందని, అనేకమంది రోగులు మరణిస్తున్నారని ఆమె ట్వీట్ చేసింది. గ్లోబల్ కమ్యూనిటీ వెంటనే స్పందించి ఇండియాను ఆదుకునేందుకు ముందుకు రావాలని గ్రెటా థన్ బెర్గ్ అభ్యర్థించింది. ఇండియాలో ఎన్నడూ లేనివిధంగా కోవిడ్ కేసులు 3.46 లక్షలకు చేరుకోవడం, 24  గంటల్లో 2,624 మంది మృతి చెందడంతో ప్రపంచ దేశాలు కూడా షాక్ తిన్నాయి. కేసుల ఉధృతి ఇంత తీవ్రంగా ఉండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.  దీంతో ఫ్రాన్స్, జర్మనీ, పాకిస్థాన్, యూకే వంటి అనేక దేశాలు ఇండియాపట్ల సంఘీభావాన్ని ప్రకటించాయి. ఇండియా కోరితే సాయపడడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. సింగపూర్, జర్మనీ వంటి దేశాలు  ఆక్సిజన్  తో కూడిన క్రయోజెనిక్ ప్లాంట్లను పంపడానికి సంసిద్ధతను ప్రకటించాయి,. అయితే ఇదే సమయంలో ఇండియా నాఒంచి వచ్చే విమాన ప్రయాణికుల పట్ల పలు దేశాలు ఆంక్షలు విధించాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు  భారత విమానాల సంఖ్యను కుదించాయి.

అటు మే 15 వరకు దేశంలో కోవిడ్  పరిస్థితి ఇలాగే ఉండవచ్చునని భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే యుధ్ధ ప్రాతిపదికన చేపట్టాలని, రోజుకు కొన్ని లక్షలమందికైనా వ్యాక్సినేషన్ చేస్తే పరిస్థితి కొంత మెరుగు పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాగా-బెంగుళూరులో ఒకే రోజు 17 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో 30 వేలకు పైగా కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి.