Iraq Covid hospital fire: బాగ్దాద్ కోవిడ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన ఆక్సిజన్ ట్యాంక్.. 23 మంది మృతి
ఇరాక్ దేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 23 మంది మరణించారు..
Iraq Covid hospital fire: ఇరాక్ దేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 23 మంది మరణించారు.. శనివారం రాత్రి ఇబ్న్ ఖతీబ్ ఆసుపత్రిలో చెలరేగిన ఈ మంటలో డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోయి, మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో.. ఒక్కసారిగా బిల్డింగ్‌లో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో హాస్పిటల్‌లో 200 మందికి పైగా కరోనా పేషంట్స్‌తో పాటు వైద్య సిబ్బంది వున్నట్లు సమాచారం.ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు బిల్డింగ్‌లో వున్నవారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంటలను చూసిన జనం భవనం నుండి పారిపోతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించింది. ఆదివారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయని ఇరాక్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. ఇరాక్ ప్రధాన మంత్రి ముస్తఫా అల్-ఖాదిమి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ “విషాద ప్రమాదం” అని, ప్రమాదానికి గల కారణాలపై తక్షణ దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
కాగా, ఈ ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 200 మందికి పైగా కరోనా బాధితుతలతో పాటు సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయని ఇరాక్ సివిల్ డిఫెన్స్ హెడ్, మేజర్ జనరల్ కదీమ్ బోహన్ మీడియాతో తెలిపారు. ఇప్పటివరకు, 120 మంది రోగులతో పాటు వారి బంధువులలో 90 మందిని అత్యవసర సిబ్బంది రక్షించారని స్థానిక వార్తా సంస్థ ఐఎన్ఎ పేర్కొంది. గాయపడిన వారిని, ఇతరల రోగులను అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు.
ఇదిలావుంటే, ఇరాక్‌లో ఫిబ్రవరి నుండి కరోనావైరస్ మహమ్మారి విరుచుకుపడుతోంది. ఈ వారంలో మొత్తం ఒక మిలియన్ కేసులు దాటిపోయాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 1,025,288 కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,217 మరణించినట్లు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.