ATA Celebrations: దేశ సంపద పెంపులో, నిర్మాణంలో ప్రవాసాంధ్రులు ముందున్నారని మంత్రి ఎర్రబెల్లి ప్రశంసలు

రాయప్రోలు సుబ్బారావు మాటలను అక్షర సత్యాలను చేస్తూ ఈ రోజు ఈ మహాసభలను 17 సార్లుగా నిర్వహిస్తున్నారంటూ ఆటా నిర్వాహకులను ప్రశంసించారు మంత్రి ఎర్రబెల్లి. మన సంస్కృతి, మన భాష, మన యాస, మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు...లను గుర్తుకు చేసుకుంటూ...వాటిని ప్రవాసాంధ్రులు తలుచుకోవాలని కోరుతున్నారు.

ATA Celebrations: దేశ సంపద పెంపులో, నిర్మాణంలో ప్రవాసాంధ్రులు ముందున్నారని మంత్రి ఎర్రబెల్లి ప్రశంసలు
Errabelli At Ata Celebratio
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 04, 2022 | 11:08 AM

ATA Celebrations: అమెరికా వాషింగ్టన్ డీసీ లో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్   ఆటా – 17వ మహాసభలకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆలా వెంకటేశ్వర రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, రవీంద్ర కుమార్, చంటి క్రాంతి కిరణ్, గాదరి కిషోర్, tsiic చైర్మన్ గాదరి బాలమల్లు, ఇతర ప్రజా ప్రతినిధులతో, అహూతులతో, ఆటా ప్రతినిధులు, ఎన్నారై మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహా సభలలో తమకు ఆతిథ్యం ఇవ్వడానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. గత 15 ఏళ్లుగా నేను ఎమ్మెల్యే గా పాల్గొనేవాడిని.. ఈ సారి మంత్రిగా వచ్చానని గుర్తు చేసుకొన్నారు. కరోనా కష్టాలను అధిగమించి రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుపుకుంటున్న తెలుగు ప్రపంచ పండుగ ఈ ఆట మహాసభలు.. ఈ పండుగ కోసం మీరంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా ఈ సభలకు ఎప్పుడు పిలుస్తారో.. అని రావడానికి చాలా కాలంగా ఎదురు చూశామని అన్నారు మంత్రి ఎర్రబెల్లి.

ఇప్పడు ఆ పండుగ రానే వచ్చింది. ఇలా అందరినీ కలవడం, మనమంతా ఒక కుటుంబం లాగా, గడపడానికి మించిన ఆనందం బహుశా ఎక్కడా దొరకదని.. ఈ పండుగలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ, ఈ వేడుకను తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్లంతా, ఈ భూమి పై వేర్వేరు చోట్ల నివసిస్తున్న తెలుగు వాళ్లంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఆటా మహాసభలు ఎంతో ప్రత్యేకమైనవి.. మనం ఎక్కడ ఉన్నా, అంతా ఒక్కటే అని చాటే సభలు ఇవి.. తెలుగు వారు  ఎక్కడ ఉన్నా మన దేశ భక్తిని, కన్న తల్లిని, పుట్టిన ఊరిని మరచిపోలేదని చాటే సందర్భమిది అంటూ ఎర్రబెల్లి చెప్పారు. ఉన్న ఊరు (usa) ను కూడా మరవని మన విశ్వసనీయత కు గుర్తు ఈ మహా సభలని పేర్కొన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా, మన పనితనంతో ఇక్కడి, మన దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాం. ఉంటాం అంటూ ప్రవాసాంధ్రులపై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి ఎర్రబెల్లి. దేశ సంపద పెంపులో, నిర్మాణంలో ప్రవాసాంధ్రులు ముందున్నాం.. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అని చెప్పిన రాయప్రోలు సుబ్బారావు గారి గీతం గుర్తుకు చేసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి.

రాయప్రోలు సుబ్బారావు  మాటలను అక్షర సత్యాలను చేస్తూ ఈ రోజు ఈ మహాసభలను 17 సార్లుగా నిర్వహిస్తున్నారంటూ ఆటా నిర్వాహకులను ప్రశంసించారు. మన సంస్కృతి, మన భాష, మన యాస, మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు…లను గుర్తుకు చేసుకుంటూ…వాటిని ప్రవాసాంధ్రులు తలుచుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరుతున్నారు.

మరిన్ని గ్లోబల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు