AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATA Celebrations: ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్‌.. ఎమ్మెల్సీ కవిత సరికొత్త నిర్వచనం

ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్ గా ఎమ్మెల్పీ కవిత అభివర్ణించారు. ఒకప్పుడు భారతదేశంలో తెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తెచ్చారన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ వారికి భారతదేశంలో కేసీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు.

ATA Celebrations: ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్‌.. ఎమ్మెల్సీ కవిత సరికొత్త నిర్వచనం
Mlc Kavita At Ata
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 04, 2022 | 11:08 AM

Share

ATA Celebrations: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ఆటా 17 వ మహాసభల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించారు. అనంతరం రచయిత ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అమెరికాలో ఉన్న తెలుగు వారికి తెలియజేసేందుకు, ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ పెవిలియన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా నిలవడంతో పాటు, భవిష్యత్ తరాలకు తెలియజేయవచ్చని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రతి మహాసభలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయాలని ఆటా ప్రతినిధులను ఎమ్మెల్సీ కవిత కోరారు.

ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్ గా ఎమ్మెల్పీ కవిత అభివర్ణించారు. ఒకప్పుడు భారతదేశంలో తెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తెచ్చారన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ వారికి భారతదేశంలో కేసీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. అదే విధంగా అమెరికాలో తెలుగువారికి ఆటా గుర్తింపు తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మహాసభల ద్వారా తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తెలియజెప్పేందుకు ఆటా ప్రతినిధులు చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగువారు ఎదిగారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

అమెరికాలోని తెలుగు అసోసియేషన్ లు తానా, ఆటాలకు ఎదైనా నగరంలో హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసి, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత సూచించారు. మాల్దీవ్స్, మారిషస్ లో ఉన్న తెలుగు వారంతా, తెలుగు భాషను, సంస్కృతిని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను అమెరికాలోని తెలుగ ప్రజల భవిష్యత్ తరాలకు అందించేందకు గాను, ఆటా కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆటా వ్యవస్థాపక సభ్యుడు హన్మంత రెడ్డి, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని గ్లోబల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై