అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు: విమానాల దారి మళ్లింపు

అమెరికాకు చెందిన మానవరహిత డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో హొర్ముజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్లే విమానాలు కూల్చివేతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు విమానాలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకున్నాయి. బ్రిటీష్ ఎయిర్‌వేస్, ఖంతాస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, మలేషియా ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, కేఎల్ఎం సహా పలు అంతర్జాతీయ విమానాలు తమ ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాలని నిర్ణయం […]

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు: విమానాల దారి మళ్లింపు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 22, 2019 | 10:30 AM

అమెరికాకు చెందిన మానవరహిత డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో హొర్ముజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్లే విమానాలు కూల్చివేతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు విమానాలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకున్నాయి. బ్రిటీష్ ఎయిర్‌వేస్, ఖంతాస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, మలేషియా ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, కేఎల్ఎం సహా పలు అంతర్జాతీయ విమానాలు తమ ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు న్యూయార్క్- ముంబై విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే తమ డ్రోన్‌ను కూల్చివేయడంతో ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికా నిర్ణయించుకుంది. ఇరాన్‌లోని మూడు లక్ష్యాలపై గురువారం రాత్రే దాడి చేయాలని అంతా సిద్ధమైనప్పటికీ.. ఆ దాడి వలన అధిక సంఖ్యలో ప్రజలు చనిపోతారని భావించిన అమెరికా అధ్యక్షుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.