ట్రంప్‌ నాపై అత్యాచారం చేశాడు: సీనియర్ మహిళా జర్నలిస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తనపై అత్యాచారం చేసినట్లు మహిళా జర్నలిస్ట్ ఇ. జీన్ కర్రోల్ ఆరోపణలు చేశారు. 23ఏళ్ల క్రితం(1995-96కాలంలో) ట్రంప్ తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆమె ప్రకటించారు. న్యూయార్క్‌లోని ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఉన్న డ్రస్సింగ్ రూమ్‌లో ఈ ఘటన జరిగిందని ఆమె అన్నారు. దాన్ని గుర్తు చేసుకున్న ఆమె.. ఆ ఘటన మొత్తాన్ని ఓ వ్యాసంలో పొందపరిచారు. ఈ వ్యాసాన్ని న్యూయార్క్ మ్యాగజైన్ తన దినపత్రికలో ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను వైట్‌హౌస్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:55 am, Sat, 22 June 19
ట్రంప్‌ నాపై అత్యాచారం చేశాడు: సీనియర్ మహిళా జర్నలిస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తనపై అత్యాచారం చేసినట్లు మహిళా జర్నలిస్ట్ ఇ. జీన్ కర్రోల్ ఆరోపణలు చేశారు. 23ఏళ్ల క్రితం(1995-96కాలంలో) ట్రంప్ తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆమె ప్రకటించారు. న్యూయార్క్‌లోని ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఉన్న డ్రస్సింగ్ రూమ్‌లో ఈ ఘటన జరిగిందని ఆమె అన్నారు. దాన్ని గుర్తు చేసుకున్న ఆమె.. ఆ ఘటన మొత్తాన్ని ఓ వ్యాసంలో పొందపరిచారు. ఈ వ్యాసాన్ని న్యూయార్క్ మ్యాగజైన్ తన దినపత్రికలో ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను వైట్‌హౌస్ ఖండించింది. అధ్యక్షుడిని చెడుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇదంతా కట్టుకథ అని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. కాగా డొనాల్డ్ ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు రావడం కొత్తేం కాదు. గతంలో 15మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు జర్నలిస్ట్ ఇ. జీన్ కర్రోల్ 16వ మహిళ.