చిలీలో 45 వేల ఉపాధ్యాయుల ఆందోళన..

చిలీలో ఉపాధ్యాయుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దాదాపు 45వేల మంది టీచర్స్ తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. శాంతియుతంగా కవాతు చేశారు. అయితే వీరిలో కొందరు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. చిలీలో మూడు వారాలుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్నారు. పాఠ్యాంశ పుస్తకాల్లో మార్పులు, ఇతర డిమాండ్లతో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

చిలీలో 45 వేల ఉపాధ్యాయుల ఆందోళన..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 22, 2019 | 10:32 AM

చిలీలో ఉపాధ్యాయుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దాదాపు 45వేల మంది టీచర్స్ తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. శాంతియుతంగా కవాతు చేశారు. అయితే వీరిలో కొందరు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. చిలీలో మూడు వారాలుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్నారు. పాఠ్యాంశ పుస్తకాల్లో మార్పులు, ఇతర డిమాండ్లతో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.