చికిత్స కోసం ఆ భారీ కాయుడ్ని.. హెలికాప్టర్‌లో…
పాకిస్థాన్ భారీకాయుడు నూర్ హసన్‌ను ఆస్పత్రికి తరలించడం అక్కడి ఆస్పత్రి వర్గాలకు, రెస్క్యూ టీంకు ఓ టాస్క్‌గా మారంది. హసన్ బరువు తగ్గేందుకు లాపోరోస్కొపిక్ సర్జరీ చేయించుకోనున్నాడు. హసన్ ఓ క్యాబ్ డ్రైవర్. అయితే గత కొన్నేళ్ల క్రితం నుంచి అధికంగా బరువు పెరిగాడు. కనీసం తన పని తాను చేసుకోలేకపోయాడు. తన గది నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో హసన్ అవస్థలు చూసిన ఓ ఆస్పత్రి అతనికి చికిత్స అందించేందుకు ముందుకు […]
పాకిస్థాన్ భారీకాయుడు నూర్ హసన్‌ను ఆస్పత్రికి తరలించడం అక్కడి ఆస్పత్రి వర్గాలకు, రెస్క్యూ టీంకు ఓ టాస్క్‌గా మారంది. హసన్ బరువు తగ్గేందుకు లాపోరోస్కొపిక్ సర్జరీ చేయించుకోనున్నాడు. హసన్ ఓ క్యాబ్ డ్రైవర్. అయితే గత కొన్నేళ్ల క్రితం నుంచి అధికంగా బరువు పెరిగాడు. కనీసం తన పని తాను చేసుకోలేకపోయాడు. తన గది నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో హసన్ అవస్థలు చూసిన ఓ ఆస్పత్రి అతనికి చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే హసన్‌ను ఆస్పత్రికి తరలించడం ఇబ్బందిగా మారింది. చికిత్స కోసం తరలించేందుకు రెస్క్యూ టీం నానా తంటాలు పడింది. 330 కిలోలు ఉన్న హసన్.. ఇంటి గుమ్మంలో పట్టకపోవడంతో.. గోడను కూల్చి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. కాగా, 2017లో 360 కిలోల బరువున్న వ్యక్తి 200 కిలోలకు తగ్గాడు. అతన్ని ఆదర్శంగా తీసుకున్న హసన్ సర్జరీకి సిద్ధమవుతున్నాడు. పాక్‌లో 29 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.