Israel-Palestine conflict: హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా లండన్‌లో సంబరాలు.. స్పందించిన పోలీసులు
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. భారత్‌తో పాటుగా బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతును ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు కొందరు హమాస్ మద్దతుదారులు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే హమాస్ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో పాటు లండన్ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. భారత్‌తో పాటుగా బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతును ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు కొందరు హమాస్ మద్దతుదారులు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే హమాస్ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో పాటు లండన్ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు తమ స్పందనను తెలియజేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడికి మద్దతునిస్తూ కొంతమంది లండన్ వీధుల్లో సంబరాలు చేసుకుంటున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నిరసనలకు దారి తీసే అవకాశం ఉంటుందని అన్నారు. లండన్ పౌరులకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టే ఎటువంటి చర్యలనైనా కూడా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
అలాంటి వాటిని అడ్డుకోవడానికే పోలీసు గస్తీని పెంచామని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు ఈ వీడియోలు వైరల్ కావడంతో వీటిని చూసిన నెటజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. కొందరు హమాస్ మద్దతుదారుల తీరుపై మండిపడుతున్నారు. మరికొందరు పాలస్తీన్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో ఎంతోమంది మహిళలు, పిల్లలను దారుణంగా హత్య చేశారు. చాలామంది అమాయకపు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడులు చేసిన వారికి మద్దతుగా లండన్‌లో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. యూరప్‌లో చాలా మంది యూదులపై మాత్రమే దాడి జరుగుతుందని అనుకుంటున్నారు. హమాస్ లాంటి ఉగ్రవాదులు తమదాకా రారని భావించడం మూర్ఖత్వమని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌కు పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర పోరులో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లో 300 లకు పైగా మృతి చెందగా.. 1500 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు హమాస్ దాడులపై ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్ వైమానిక దళం పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై విరుచుకుపడింది. దీంతో అక్కడ 300 మందికిపైగా పౌరులు ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ యుద్ధ పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. భారత్ నుంచి అక్కడికి రాకపోకలు సాగించే విమానాలను వారం రోజులపాటు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ‘ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా.. టెల్ అవీవ్ ప్రాంతానికి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాలను అక్టోబరు 14 వరకు నిలిపివేస్తున్నామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..