సుప్రీంకోర్టు జడ్జినే అంత మాటన్నాడు.. బ్రెజిల్ అధ్యక్షుని నోటి దురుసు
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో తన దేశంలో క్రమంగా పాపులారిటీని కోల్పోతున్నారు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తినే అవమానిస్తూ వ్యాఖ్యానించారు. ఆ జడ్జి వేశ్యకు పుట్టిన కొడుకని తన ఫేస్ బుక్ లైవ్ లో కామెంట్ చేసి ఆ తరువాత దాన్ని ఆయన తొలగించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో తన దేశంలో క్రమంగా పాపులారిటీని కోల్పోతున్నారు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తినే అవమానిస్తూ వ్యాఖ్యానించారు. ఆ జడ్జి వేశ్యకు పుట్టిన కొడుకని తన ఫేస్ బుక్ లైవ్ లో కామెంట్ చేసి ఆ తరువాత దాన్ని ఆయన తొలగించారు.కానీ అప్పటికే అది సోషల్ మీడియాలో షేర్ అయింది. తమ దేశ ఓటింగ్ సిస్టం సవ్యంగా లేదని, దీన్ని మార్చాలని బొల్సనారో డిమాండ్ చేస్తున్నారు. ఇది ఫ్రాడ్ తో కూడుకొన్నదన్నారు. కానీ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జి, ఎలెక్టోరల్ కాలేజీ హెడ్ కూడా అయిన జస్టిస్ లూయిస్ రాబర్ట్ బరోసా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పడుతూ..ఆ న్యాయమూర్తిని ఇలా ఇన్సల్ట్ చేశారు. అయితే ఎన్నికల వ్యవస్థపై ఓ ఫోరమ్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జస్టిస్ లూయిస్.. తన చర్యలు ఇలాంటి ‘న్యూసెన్స్’ ని క్రియేట్ చేస్తున్నాయంటే అది తన విధిని తాను సక్రమంగా నిర్వహిస్తున్నాననడానికి సంకేతమేనని పేర్కొన్నారు. కాగా- ప్రస్తుతం బ్రెజిల్ లో వినియోగిస్తున్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులు ప్రింట్ చేసిన బ్యాలట్ పత్రాలను వినియోగించాలని బొల్సనారో డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ఏదైనా ఎన్నికల ఫలితంపై వివాదం ఏర్పడినప్పుడు మళ్ళీ ఆ బ్యాలట్ పత్రాలను లెక్కించడానికి వీలవుతుందన్నారు.
చూడబోతే ఈయన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దారిలోనే వెళ్తున్నాడని విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆయన కూడా ఇలాగే తమ దేశంలో ఓటింగ్ ఫ్రాడ్ జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది బ్రెజిల్ లో అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతానన్న భయంతో బొల్సనారో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. దేశంలో కోవిడ్ వ్యాప్తిని అదుపు చేయడంలో ఈయన విఫలమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా..
మరిన్ని ఇక్కడ చూడండి: ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా? గూగుల్‌లో యాప్స్ కోసం వెతుకుతున్నారా..? అయితే మీ ఖాతా ఖాళీ.. జాగ్రత్త..!
Viral Video: అమ్మబాబోయ్.. దూడను అమాంతం నమిలి మింగేసిన కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!