AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా? గూగుల్‌లో యాప్స్‌ కోసం వెతుకుతున్నారా..? అయితే మీ ఖాతా ఖాళీ.. జాగ్రత్త..!

Online banking: ప్రస్తుతం టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందింది. బ్యాంకింగ్‌ రంగంలో అయితే సేవలు మరింత సులభతరం అయ్యాయి. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో..

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా? గూగుల్‌లో యాప్స్‌ కోసం వెతుకుతున్నారా..? అయితే మీ ఖాతా ఖాళీ.. జాగ్రత్త..!
Online Banking
Subhash Goud
|

Updated on: Aug 07, 2021 | 1:16 PM

Share

Online Banking: ప్రస్తుతం టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందింది. బ్యాంకింగ్‌ రంగంలో అయితే సేవలు మరింత సులభతరం అయ్యాయి. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో ఉండి స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే బ్యాంకు సేవలు చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. నగదు చెల్లింపులు పూర్తిగా ఆన్‌లైన్‌ అయిపోయింది. చిన్న చిన్న షాపుల్లో కూడా క్యూఆర్‌ కోడ్‌తో నగదు చెల్లింపులు జరుపుతున్నారు. అయితే ఇందులో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయంటున్నారు టెక్‌ నిపుణులు. ఫిషింగ్, విషింగ్, స్కిమ్మింగ్ వంటి ఆన్‌లైన్ టూల్స్ ద్వారా మీ ఖాతాల్లోని నగదును మోసగాళ్లు దొంగిలించవచ్చని, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇటువంటి మోసాలు జరగకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు. టెక్‌ నిపుణులు సూచిస్తున్నదాని ప్రకారం..

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో పబ్లిక్‌ వైఫై:

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ లావాదేవీలు చేసే సమయంలో పబ్లిక్‌ వైఫై ఉపయోగించకపోవడం మంచిది. ఇటువంటి కనెక్షన్లు సాధారణంగా అంత సురక్షితంగా ఉండవు. వీటిని హ్యాక్ చేయడం కూడా చాలా సులభం. ఇలాంటి వాటి ద్వారా మీ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌ఫెక్ట్ చేసి మీ బ్యాంకింగ్ వివరాలను కాజేసే అవకాశం ఎక్కువగా ఉంది.

బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నెంబర్ల కోసం గూగుల్‌లో వెతకడం:

బ్యాంకు కస్టమర్ల కేర్‌ నెంబర్‌ కోసం చాలా మంది గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుంటారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయా బ్యాంకుల అధికారి వెబ్‌ సైట్‌ నుంచే తీసుకోవడం మంచిది. ఇలా నెంబర్లు గూగుల్‌లో వెతకడం వల్ల సైబర్‌ నేరగాళ్లు మీ సమాచారం దొంగిలించే అవకాశం ఉంది.

గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ ప్లేస్టోర్‌:

గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ ప్లేస్టోర్‌ దొరికేవి తప్ప వేరే యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయకపోవడం మంచిది. మీకు కావాల్సిన యాప్స్‌ను ఇలాంటి అధికారిక స్టోర్ల నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనధికారిక స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే మీ స్మార్ట్ ఫోన్, అందులో ఉండే డేటా ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌:

మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు మీ మొబైల్‌లో ఉండే సమస్యలను పరిష్కరిస్తాయి. అంతేకాకుండా సైబర్ నేరాల బారిన మీరు పడే అవకాశం కూడా తగ్గుతుంది. మీ ఫోన్‌లో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్, ఆపరేటింగ్ సిస్టం ఉంటే వాటిని ఛేదించడం హ్యాకర్లకు కష్టం అవుతుంది.

పేమెంట్‌ ఆధారిత లింకులు:

మీకు ఏమైనా పేమెంట్‌ ఆధారిత లింకులు ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్లో వస్తే వాటి ద్వారా ఎటువంటి లావాదేవీలు జరగపకండి. సైబర్ నేరగాళ్లు ఇవి బ్యాంకింగ్ ఆధారిత లావాదేవీలని, వీటిని పూర్తి చేయడం అత్యవసరం అనే రేంజ్‌లో ఇటువంటి మెసేజ్‌లు పంపుతారు.

ఆన్‌లైన బ్యాంకింగ్‌కు సులభమైన పాస్‌వర్డ్‌లు:

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు సులభమైన పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. బలహీనమైన పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు కనిపెట్టడం చాలా సులభం. బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టడం ద్వారా సైబర్ నేరాల బారిన పడే అవకాశం చాలా తక్కువ. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి మార్చడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

మొబైల్‌ నెంబర్‌ లింక్‌:

మీరు ఎక్కువగా ఉపయోగించని మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకండి. ఎక్కువగా ఉపయోగించే మొబైల్‌ నెంబర్లు, ఈ-మెయిల్‌ ఐడీ మాత్రమే ఉపయోగించండి. ఎందుకంటే ఎవరైనా మోసగాళ్లు మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు కాజేస్తే ఆ విషయం మీకు వెంటనే తెలుస్తుంది.

ఫోన్‌ యాప్స్‌తో జర భద్రం:

ఫోన్‌ యాప్స్‌తో కూడా జర భద్రంగా ఉండండి. అవసరం లేని పర్మిట్లు ఇవ్వకండి. అలాంటి పర్మిషన్లు ఇవ్వడం వల్ల మీ ఫోన్‌లో డేటాను తస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెక్నికల్‌గా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదని, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Samsung Galaxy F62: శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. అదిరిపోయే ఫీచర్స్‌!

Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌.. బగ్‌ను గుర్తిస్తే భారీ బహుమతి.. హ్యాకర్లకు సవాల్‌ విసరుతున్న ట్విటర్‌..!

Mobile‌ Explosion: మొబైల్ ఫోన్స్ ఎందుకు పేలుతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?

Follow Us