Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌.. బగ్‌ను గుర్తిస్తే భారీ బహుమతి.. హ్యాకర్లకు సవాల్‌ విసరుతున్న ట్విటర్‌..!

Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తన సైట్‌లో బగ్‌ను ఎవరైనా గుర్తిస్తే భారీగా పారితోషకం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ట్విటర్‌లో యూజర్ల డేటాకు

Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌.. బగ్‌ను గుర్తిస్తే భారీ బహుమతి.. హ్యాకర్లకు సవాల్‌ విసరుతున్న ట్విటర్‌..!
Twitter
Follow us
Subhash Goud

|

Updated on: Aug 04, 2021 | 12:34 PM

Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తన సైట్‌లో బగ్‌ను ఎవరైనా గుర్తిస్తే భారీగా పారితోషకం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ట్విటర్‌లో యూజర్ల డేటాకు సంబంధించి తాను అందిస్తున్న సెక్యూరిటీపై తనకు తానే ఛాలెంజ్‌ విసురుకుంది. ట్విటర్‌లోని లోపాలను గుర్తిస్తే ఏకంగా రెండున్నర లక్షల రూపాయల బహుమతి అందిస్తామని వెల్లడించింది.

తమ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథంలో బగ్‌ను గుర్తిస్తే నగదు బహుమతిని అందిస్తామని ట్విటర్‌ ప్రకటించింది. బగ్‌ బౌంటీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం ట్విటర్‌కి ఇదే మొదటిసారి. ఈ ఏడాది హ్యాకర్ కన్వెన్షన్ ఈవెంట్‌ను డెఫ్‌ కాన్‌ ఏఐ (DEF CON AI) విలేజ్‌లో ఈ పోటీ జరగనుంది. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో ట్విటర్‌ ప్రకటించింది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథం మోడళ్లలోని లోపాలను గుర్తించడం చాలా కష్టమని, హ్యాకర్లకు ఇదో సవాల్‌ అని పేర్కొంది. దాన్ని స్వీకరించి లోపాలను పట్టిస్తే ఈ భారీ బహుమతి అందజేస్తామని వెల్లడించింది.

లోపాలను గుర్తించిన ముగ్గురికి బహుమతులు:

అయితే ట్విటర్‌ బిగ్‌ బౌంటీ ప్రోగ్రాంలో భాగంగా లోపాలను గుర్తించిన మొదటి, రెండు, మూడు స్థానాలలో నిలిచిన వ్యక్తులకు వరుసగా, సుమారు రూ.2,60,242, రూ. 74,369, 37,184) నగదు బహుమతులను ముట్టజెప్పనున్నట్లు పేర్కొంది. ఈ బగ్‌ను గుర్తించిన వారిని ట్విటర్‌ ఆగస్టు 8న డేఫ్‌ కాన్‌ ఏఐ విలేజ్‌లో హోస్ట్‌ చేస్తోన్న వర్క్‌ షాప్‌లో విజేతలను ప్రకటించనుంది. ఈ పోటీలో పాల్గొనే ఔత్సాహికులకు 2021 ఆగస్టు 6 వరకు ఎంట్రీలు చేయవచ్చని తెలిపింది.