Covid Vaccine Mixing: కరోనా కట్టడిలో మరో కీలక పరిణామం.. ఆ రెండు వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై కేంద్రం పరిశీలన

దేశంలో కరోనావైరస్ పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇన్నాళ్లు వ్యాక్సినేషన్ విషయంలో అవలంబించిన విధానంలో భారీ మార్పులను..

Covid Vaccine Mixing: కరోనా కట్టడిలో మరో కీలక పరిణామం.. ఆ రెండు వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై కేంద్రం పరిశీలన
Vaccination
Follow us
Javeed Basha Tappal

|

Updated on: Aug 04, 2021 | 12:49 PM

దేశంలో కరోనావైరస్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇన్నాళ్లు వ్యాక్సినేషన్ విషయంలో అవలంబించిన విధానంలో భారీ మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక సంస్థ అభివృద్ధి చేసిన రెండు డోసుల వ్యాక్సిన్‌ను పౌరులకు అడ్మినిస్టర్ చేస్తున్నారు. మొదటి డోసును ఒక సంస్థ తయారు చేసింది, రెండో డోసును ఇతర సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను వేసే పద్ధతి ఇంకా లేదు. కానీ, ఈ వ్యాక్సినేషన్ పద్ధతిలో మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రష్యా తయారీ స్పుత్నిక్, ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ డోసుల మిక్సింగ్‌కు అనుమతి మంజూరు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

పరిశోధనల్లో తేలిన ఫలితం.. స్పుత్నిక్, కోవిషీల్డ్ రెండు డోసులు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని గత పరిశోధనల్లో తేలింది. రెండు వేర్వేరు కంపెనీల టీకాలను తీసుకోవడం వల్ల మనుషుల్లో కరోనాను ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తి పెరుగుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్ మిక్సింగ్‌కు కేంద్రం అనుమతి ఇస్తే టీకాను ప్రజలే ఎంచుకోవచ్చు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి డోసుగా స్పుత్నిక్, రెండో డోసు కోవిషీల్డ్ వేసుకోవచ్చు. లేదా, మొదటి డోసు కోవిషీల్డ్, రెండో డోసు స్పుత్నిక్ తీసుకోవచ్చు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి పెంపునకై వ్యాక్సిన్ల మిక్సింగ్ ప్రక్రియపై కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చర్యలు తీసుకుంటోంది.