Nasal Spray: ముక్కులోనే కరోనా పనిపట్టే మందు రెడీ.. మన దేశంలో మూడో ఫేజ్ ట్రయల్స్!

KVD Varma

KVD Varma |

Updated on: Aug 04, 2021 | 4:04 PM

కరోనా చికిత్సకు ఉపయోగపడే నాసల్ స్ప్రే త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానుంది. భారతీయ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ .. కెనడియన్ కంపెనీ సనోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో జతకట్టింది.ఇది నాసల్ స్ప్రే తయారు చేస్తుంది.

Nasal Spray: ముక్కులోనే కరోనా పనిపట్టే మందు రెడీ.. మన దేశంలో మూడో ఫేజ్ ట్రయల్స్!
Nasal Spray

Nasal Spray: కరోనా చికిత్సకు ఉపయోగపడే నాసల్ స్ప్రే త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానుంది. భారతీయ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ .. కెనడియన్ కంపెనీ సనోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో జతకట్టింది.ఇది నాసల్ స్ప్రే తయారు చేస్తుంది. భారతదేశంతో పాటు, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, తైవాన్, నేపాల్, బ్రూనై, కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, శ్రీలంకతో సహా ఆసియాలోని అనేక దేశాలకు స్ప్రే సరఫరా చేయడానికి ఆ కంపెనీ ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంది.  ఇది ఆసియా దేశాలపై కరోనా సంక్రమణ ఒత్తిడిని తగ్గిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దాన్హా అన్నారు. స్ప్రేని వీలైనంత త్వరగా ఆసియా అంతటా సరఫరా చేసేలా తమ కంపెనీ చూసుకుంటుందని ఆయన చెప్పారు.

నాజల్ స్ప్రే ఎలా పనిచేస్తుంది

కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న సనోటైజ్ అనే బయోటెక్ కంపెనీ ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (NONS) ని అభివృద్ధి చేసింది. ఈ స్ప్రేని రోగులే వారి ముక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముక్కులోనే వైరల్ లోడ్‌ను తగ్గిస్తుంది. దీనివలన వైరస్ పెరగదు లేదా ఊపిరితిత్తులకు హాని కలిగించదు.

కెనడాలోనూ, యూకే లోనూ ఈ నాసల్ స్ప్రే ట్రయల్స్ జరిగాయి. 79 మంది సోకిన వ్యక్తులపై రెండవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో, ఈ నాసికా స్ప్రే 24 గంటల్లో 95%, 72 గంటల్లో 99% వైరల్ లోడ్‌ను వారిలో తగ్గించింది. ఈ ట్రయల్స్ లో ఈ నాసల్ స్ప్రే కరోనా యూకే వేరియంట్‌కు  వ్యతిరేకంగా కూడా సమర్థవంతంగా పనిచేసింది.  కెనడాలో ఫేజ్ II క్లినికల్ ట్రయల్స్ సమయంలో, 103 మందికి  ముక్కులో స్ప్రే చేశారు.  ఎవరూ కోవిడ్ -19 పాజిటివ్‌గా మారలేదు. యూకే లో రెండో ఫేజ్  క్లినికల్ ట్రయల్స్‌లో 70 మంది పాల్గొన్నారు. అందరూ కోవిడ్ -19 సోకినవారు. అధ్యయనంలో ఉన్న ఇతరులు వారి ముక్కులో స్ప్రే చేసిన వారి కంటే 16 రెట్లు ఎక్కువ వైరల్ లోడ్ కలిగి ఉండడాన్ని పరిశోధకులు గమనించారు.  గతంలో కెనడాలో నిర్వహించిన ట్రయల్స్‌లో, 7,000 మంది రోగులను పరీక్షించారు. రోగులలో ఎవరూ తీవ్రమైన దుష్ప్రభావాలను అనుభవించలేదు.

భారతదేశంలో ఫేజ్ -3 ట్రయల్స్ ఉండవచ్చు..

ఇప్పటికే ఇజ్రాయెల్, న్యూజిలాండ్ చికిత్స కోసం ఈ స్ప్రేని ఆమోదించాయి. కంపెనీ గత నెలలో ఇజ్రాయెల్‌లో స్ప్రే ఉత్పత్తిని ప్రారంభించింది. సనోటైజ్ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ గిలి రేగెవ్ మాట్లాడుతూ, తాము భారతదేశంలో భాగస్వాముల కోసం చూస్తున్నామని, స్ప్రే భారతదేశంలో వైద్య పరికరంగా ఆమోదించబడాలని ఆశిస్తున్నట్లు అప్పట్లో చెప్పారు.

సనోటైజ్ 4-5 వేల మందితో ఫేజ్ -3 ట్రయల్స్ నిర్వహించాలనుకుంటున్నారు. రెగెవ్ ప్రకారం, ఫేజ్ -3 ట్రయల్స్‌లో కొంత భాగం భారతదేశంలో కూడా జరగవచ్చు. వారు దీనికి నిధుల కోసం చూస్తున్నారు. నిధులు అందిన వెంటనే, కంపెనీ  భారతదేశంలో ట్రయల్స్ నిర్వహించగలుగుతుంది.

Also Read: Covid Vaccine Mixing: కరోనా కట్టడిలో మరో కీలక పరిణామం.. ఆ రెండు వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై కేంద్రం పరిశీలన

Corona 3rd Wave: పెరుగుతున్న కరోనా పునరుత్పత్తి మూడో వేవ్‌కు సంకేతమా? అసలు పునరుత్పత్తి రేటు అంటే ఎమిటి?  పూర్తి వివరాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu