AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosambi Benefits: మోసంబి జ్యూస్‏తో ఎముకలకు బలం.. జుట్టు సమస్యలకు చెక్.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు..

సాధారణంగా ప్రకృతిలో లభించే ఎన్నో పండ్లు, మొక్కల ద్వారా మన ఆరోగ్యానికి ప్రయోజనాలు బోలేడు ఉన్నాయి. ముఖ్యంగా

Mosambi Benefits: మోసంబి జ్యూస్‏తో ఎముకలకు బలం.. జుట్టు సమస్యలకు చెక్.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు..
Mosambi Juice
Rajitha Chanti
|

Updated on: Aug 04, 2021 | 12:49 PM

Share

సాధారణంగా ప్రకృతిలో లభించే ఎన్నో పండ్లు, మొక్కల ద్వారా మన ఆరోగ్యానికి ప్రయోజనాలు బోలేడు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పండ్లు.. సహజంగా లభించే పండ్లలలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యంతోపాటు.. అందానికి కూడా మేలు చేసే వాటిలో మోసంబి ఒకటి. దీనిని బత్తాయిలు అని కూడా అంటారు. దీనిని అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత అలసట, బలహీనతను తొలగించుకోవడానికి ఎక్కువగా మోసంబి జ్యూస్ తాగుతుంటారు. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే మోసంబి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిసుకుందామా.

1. మోసంబిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వేసవికాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. శరీరానికి బలాన్ని అందించడమే కాకుండా.. స్ట్రోక్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్‏గా ఉంచుతుంది. అలాగే వికారాన్ని తగ్గిస్తుంది. 2. నెట్‌మెడ్స్ నివేదిక ప్రకారం మోసంబిలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం ద్వారా ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది.విరేచనాలు, వాంతులు, వికారంగా ఉన్నప్పుడు మోసంబి జ్యూస్ తీసుకోవాలి. 3. విటమిన్ సి లోపం ఉండడం వలన స్కర్వి వ్యాధికి దారితీస్తుంది. అంటే నోటిలో చిగుళ్ల వాపు, జలుబు, నాలుకపై పుండ్లు ఉంటాయి. మోసంబి రసంలో నల్ల ఉప్పు కలిపి చిగుళ్లపై రాస్తే సమస్యలను తగ్గిపోతాయి. అలాగే నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. 4. మోసాంబిలో ఫ్లేవనాయిడ్స్ లిమోనేన్ గ్లూకోసైడ్ ఉండటం వలన క్యాన్సర్ వ్యాధిని నియంత్రిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పొరాడడమే కాకుండా.. అల్సర్, గాయాలకు చికిత్స చేస్తుంది. రక్క ప్రసరణను మెరుగు పరుస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 5. మోసంబిలో ఉంటే యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేక సౌందర్య సమస్యలను నివారిస్తాయి. ఇవి జుట్టు సమస్యలను, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు జుట్టును బలంగా చేస్తాయి. అలాగే చుండ్రు, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. 6. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. తద్వారా శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాల చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం లోపాన్ని తగ్గించడమే కాకుండా.. ఎముకలను బలంగా చేస్తుంది. 7. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను బలాన్ని పెంచుతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read: Monsoon Health Tips: వర్షాకాలంలో తులసి కషాయం తాగితే రోగాలు మటాష్.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా.

Yashika Aannand: బ్రతికినంత కాలం దోషిగానే ఉండిపోతాను.. స్నేహితురాలిపై భావోద్వేగ పోస్ట్ చేసిన యాషిక..